న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత పర్యటనలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్

Amol Muzumdar appointed South Africa batting coach for India series

హైదరాబాద్: త్వరలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. బారత పర్యటనలో భాగంగా సఫారీ జట్టు అద్భుత ప్రదర్శన చేయాలని అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

సఫారీలకు చుక్కులు చూపించే ఆ ఐదుగురు క్రికెటర్లు వీరే!

ఇందులో భాగంగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ముంబై దిగ్గజ ఆటగాడు అమోల్‌ మజుందార్‌ను తాత్కాలిక బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించుకుంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ సెప్టెంబర్ 15న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి టీ20లో ప్రారంభం కానుంది.

టీ20 సిరిస్ ముగిసిన తర్వాత టీమిండియా అక్టోబర్ 2 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరిస్ ప్రారంభమవుతుంది. చివరగా 2015-16లో భారత పర్యటనకు వచ్చిన సఫారీ జట్టు ధోని నాయకత్వంలోని టీమిండియాను చిత్తగా ఓడించి టీ20, వన్డే సిరిస్‌ను గెలుచుకోగా... టెస్టు సిరిస్‌లో మాత్రం 0-3తో ఓడిపోయింది.

తమిళ తలైవాస్ vs పట్నా పైరేట్స్: గెలుపు రుచి చూసేదెవరు?తమిళ తలైవాస్ vs పట్నా పైరేట్స్: గెలుపు రుచి చూసేదెవరు?

ఈసారి మాత్రం టెస్టు సిరిస్‌లో సత్తా చాటాలని సఫారీలు భావిస్తున్నారు. ఇక, అమోల్ మజుందార్‌ విషయానికి వస్తే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 48.13 యావరేజితో 11,167 పరుగులు చేశారు. పీటిఐకి ఇచ్చిన ఇంటర్యూలో అమోల్ మంజుదార్ మాట్లాడుతూ "గత వారం దక్షిణాఫ్రికా ప్రతినిధి నన్ను కలిశారు. ఈ సవాల్‌కు నేను అంగీకరించా. ఒక అంతర్జాతీయ జట్టుతో కలిసి పనిచేయడం చాలా గౌరవం" అని తెలిపాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అస్సాం జట్టు తరుపున ఆడటానికి ముందు ముంబై తరుపున ఎక్కువ కాలం మంజుదార్ ఆడాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌తో పాటు లిస్ట్‌-ఏ మ్యాచుల్లో సైతం సత్తా చాటారు. లిస్ట్ ఏ క్రికెట్‌లో మంజుదార్ మొత్తం 3268 పరుగులు చేశారు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేశారు.

Story first published: Monday, September 9, 2019, 18:01 [IST]
Other articles published on Sep 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X