న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరే ఓ బచ్చా.. ఏడేళ్లలోనే ధోనీ మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచాడురా.. పాక్ ఫ్యాన్‌ నోరు మూయించిన అమిత్ మిశ్రా!

Amit Mishra shuts down a Pakistan fan with his savage reply

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ‌ని హేళన చేసిన ఓ పాకిస్థాన్ అభిమానికి వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా దిమ్మతిరిగే బదులిచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ కంటే పాక్ బ్యాటర్ యాసిర్ షా ఎక్కువ పరుగులు చేశాడని సదరు అభిమాని చేసిన ట్వీట్‌కు అమిత్ మిశ్రా తనదైన శైలిలో బదులిచ్చాడు. మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచేందుకు పాకిస్థాన్‌కు 24 ఏళ్లు పడితే.. ఏడేళ్ల కాలంలో ధోనీ మూడు టైటిళ్లను గెలిచాడని, అది ధోనీ పవర్ అంటూ అమిత్ మిశ్రా... పాక్ అభిమాని నోరు మూయించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవ్వగా.. ధోనీ ఫ్యాన్స్ అమిత్ మిశ్రాను ప్రశంసిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

ప్రస్తుతం పాకిస్థాన్-ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో పరుగుల వరద పారుతోంది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్‌పై తొలి రోజే ఇంగ్లండ్ 506 పరుగులు చేసి టెస్ట్ క్రికెట్‌లో వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఈ క్రమంలో 112 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టింది. ఆ జట్టు టాప్-5 బ్యాటర్లలో నలుగురు సెంచరీలు చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన పాకిస్థాన్ సైతం భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. మూడోరోజు, శనివారం ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 7 వికెట్లకు 499 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ముగ్గురూ శతకాలు నమోదు చేశారు. దాంతో పీసీబీ తీరుపై సొంత అభిమానుల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి.

 ధోనీ కంటే యాసిర్ షాకే ఎక్కువ సెంచరీలు..

ధోనీ కంటే యాసిర్ షాకే ఎక్కువ సెంచరీలు..

భారత అభిమానులు సైతం పాక్ బ్యాటర్లను తక్కువ చేస్తూ ట్రోల్ చేశారు. ఫ్లాట్ వికెట్లపైనే పాక్ ఆటగాళ్లు చెలరేగుతారని, ఇతర వికెట్ల‌పై మాత్రం దారుణంగా విఫలమవుతారని విమర్శించారు. ఈ ట్రోల్స్‌కు ఆగ్రహానికి గురైన హజ్‌హరూన్ అనే పాకిస్థాన్ ట్విటర్ యూజర్.. ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. ధోనీని తక్కువ చేస్తూ ట్వీట్ చేశాడు. 'ఫ్లాట్ ట్రాక్స్‌పైనే పాకిస్థాన్ బ్యాటర్లు చెలరేగుతారని భారత అభిమానులు విమర్శిస్తున్నారు. అయితే ఆసియా బయట యాసిర్ షా ధోనీ కంటే ఎక్కువ సెంచరీలు చేసాడు.'అని నోరు మూసి ఉన్న ఏమోజీని జతగా చేర్చి ట్వీట్ చేశాడు.

ధోనీతో పోలిక ఎంట్రా బచ్చా..

ధోనీతో పోలిక ఎంట్రా బచ్చా..

ఈ ట్వీట్‌ను చూసి చిర్రెత్తుకుపోయిన అమిత్ మిశ్రా... ధోనీతో పోలిక ఏంటన్నట్లు దిమ్మతిరిగే బదులిచ్చాడు. 'ముగ్గురు కెప్టెన్లు కలిసి 24 ఏళ్లలో పాకిస్థాన్ వన్డే, టీ20, ఛాంపియన్స్ ట్రోఫీ అందిస్తే.. ధోనీ ఒక్కడే ఏడేళ్ల వ్యవధిలోనే ఈ మూడు టైటిళ్లు గెలిచాడు. అది ధోనీ పవర్'నోరు మూసుకోరా బచ్చా అనే ఏమోజీతో రీట్వీట్ చేశాడు. దీంతో ట్విటర్ వేదికగా ఇరు దేశాల అభిమానుల మధ్య ఓ యుద్దమే నడుస్తోంది. భారత వైఫల్యాలను పాక్ అభిమానులు.. పాక్ వైఫల్యాలను టీమిండియా ఫ్యాన్స్ ఎండగడుతూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

గుండుపై బంతి రుద్ది!

గుండుపై బంతి రుద్ది!

ఇక ఇంగ్లండ్-పాక్ తొలి టెస్ట్‌లో బౌలర్లు ఎంత ప్రయత్నించినా పరుగుల వేగం తగ్గడం లేదు. వికెట్లు రావడం లేదు. దాంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్ సరదాగా చేసిన ఓ ప్రయోగం అందరికి నవ్వులు తెప్పించింది. రాబిన్సన్‌ బౌలింగ్‌ చేసే సమయంలో రివర్స్‌ స్వింగ్‌కు బంతి సహకరించేందుకు స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ తలపై టోపీని తీసి నున్నని అతడి గుండుపై బంతి రుద్దాడు. దీంతో వ్యాఖ్యాతగా ఉన్న ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసర్‌ హుస్సేన్‌కు నవ్వాగలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Story first published: Sunday, December 4, 2022, 11:30 [IST]
Other articles published on Dec 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X