న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

No. 4 స్థానానికి కోహ్లీ చక్కగా సరిపోతాడు: విరాట్ కోహ్లీ

Ambati Rayudu suited for No 4 slot: Virat Kohli

హైదరాబాద్: వచ్చే ఏడాది వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో అంబటి రాయుడు నాలుగో స్థానంలో కుదురుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి వన్డే గువహటి వేదికగా ఆదివారం ప్రారంభం కానుంది.

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ నాలుగో స్థానంలో అంబటి రాయుడు కుదురుకుంటే టీమిండియా ఎదుర్కొంటోన్న గందరగోళం తీరినట్లేనని విరాట్ కోహ్లీ తెలిపాడు. "చాలా కాలంగా ఈ స్థానంలో సరైన వ్యక్తి కోసం చూస్తున్నాం. చాలా మంది ఆటగాళ్లను పరిశీలించాం. కానీ మేం కోరుకున్న విధంగా వారు రాణించలేకపోయారు" అని కోహ్లీ అన్నాడు.

ఆసియా కప్‌లో రాయుడు మంచి ఆటతీరు

ఆసియా కప్‌లో రాయుడు మంచి ఆటతీరు

"యుఏఈ వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో రాయుడు మంచి ఆటతీరు కనబరిచాడు. వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో రాయుడు నాలుగో స్థానంలో కుదురుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలి. అతడి ఆటను గమనించాను. రాయుడు మిడిల్ ఆర్డర్‌ లో ఆడటానికి సరిగా సరిపోతాడు. కొంతమేర మా మిడిల్ ఆర్డర్‌ కుదురుకుందని భావిస్తున్నాం" అని కోహ్లీ పేర్కొన్నాడు.

 రాయుడు 43.00 యావరేజితో 602 పరుగులు

రాయుడు 43.00 యావరేజితో 602 పరుగులు

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున రాయుడు 43.00 యావరేజితో 602 పరుగులు చేశాడు. 149.75 స్ట్రైక్‌ రేట్‌ నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో ఇంగ్లాండ్ పర్యటనలో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆ తర్వాత యో-యో టెస్టులో విఫలం కావడంతో టీమిండియా సెలక్టర్లు అతడిని పక్కకు బెట్టారు.

జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం

జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం

ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం... యూఏఈలో జరిగిన ఆసియా కప్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్‌కు ముందు 18 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. వాటిలో వెస్టిండిస్‌‌తో ఆడనున్న ఐదు వన్డేల సిరీస్‌ కూడా ఉంది.

Story first published: Sunday, October 21, 2018, 9:56 [IST]
Other articles published on Oct 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X