న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంబటి రాయుడు మళ్లీ టీమిండియాకు ఆడినా ఆశ్చర్యం లేదు: బ్రాడ్‌ హాగ్‌

Ambati Rayudu playing for India soon says Brad Hogg
IPL 2020 : Ambati Rayudu's Chances of Playing For Team India Again || Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలుపొంది, మరొకటి ఓడిపోయింది. అయితే సీఎస్‌కే బ్యాట్స్‌మన్‌ మాత్రం అద్భుత ఫామ్‌లో ఉన్నారు. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌పై ఓడిపోయినప్పటికీ 200 పరుగులు చేశారు. షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్ ఆకట్టుకున్నారు. ఇక ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి గేమ్‌లో తెలుగు తేజం అంబటి రాయుడు స్టాండ్ అవుట్ పెర్ఫార్మర్‌గా నిలిచాడు. 48 బంతుల్లో 71 పరుగులు చేసి స్టార్ అయ్యాడు.

టీమిండియాకు ఆడినా ఆశ్చర్యం లేదు

టీమిండియాకు ఆడినా ఆశ్చర్యం లేదు

అంబటి రాయుడు బ్యాటింగ్ తీరుపై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్‌ హాగ్‌ అయితే రాయుడు మళ్లీ టీమిండియాకు ఆడినా ఆశ్చర్యం లేదన్నాడు. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్టు చేసిన ఓ వీడియోలో బ్రాడ్‌ హాగ్‌ మాట్లాడుతూ... 'సీఎస్‌కే లోతైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉంది. అంబటి రాయుడు బాగా ఆడుతున్నాడు. కీలక సమయంలో ఒత్తిడి లేకుండా బాగా బ్యాటింగ్ చేశాడు. త్వరలోనే అతడు భారత జట్టులోకి తిరిగి వచ్చినా ఆశ్చర్యపోను. అతడికి ఇది మంచి టోర్నీ అవుతుందనుకుంటున్నా. రాయుడు అత్యున్నతంగా కనిపిస్తున్నాడు' అని తెలిపాడు.

33 బంతుల్లోనే అర్ధ సెంచరీ

33 బంతుల్లోనే అర్ధ సెంచరీ

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు మురళీ విజయ్, షేన్ వాట్సన్‌లు తక్కువ పరుగులకే వెనుతిరిగారు. ఈ దశలో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు అంబటి రాయుడు. జేమ్స్ ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో బ్యాక్‌ఫుట్‌పై కొట్టిన ఫోర్‌తో రాయుడు జోరు మొదలైంది.

ట్రెంట్ బౌల్ట్‌ ఓవర్లో కొట్టిన కవర్‌ డ్రైవ్‌ బౌండరీ అయితే చూడముచ్చటగా అనిపించింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన వరుస బంతుల్లో ఫోర్, సిక్స్‌ (ఫ్రీ హిట్‌) కొట్టిన రాయుడు జోరు పెంచాడు. కృనాల్‌ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్‌ కొట్టిన అనంతరం.. బుమ్రా ఓవర్లో కొట్టిన అద్భుతమైన స్ట్రెయిట్‌ బౌండరీతో 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో హాఫ్ చేసిన పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రాయుడు నిలిచాడు. ఆ తర్వాత కూడా కొన్ని మంచి షాట్లతో అలరించిన రాయుడు చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తొడ కండరాలు పట్టేయడంతో

తొడ కండరాలు పట్టేయడంతో

గాయం కారణంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడు బరిలోకి దిగలేదు. తొడ కండరాలు పట్టేయడంతో మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సమాచారం. ప్రస్తుతం రాయుడు గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే ముందస్తు జాగ్రత్తగా మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు విశ్రాంతిని ఇస్తారట. రాయుడు భారత్ తరఫున 55 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. ఇక 148 ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడాడు.

2018 సీజన్‌లో 602 పరుగులు

2018 సీజన్‌లో 602 పరుగులు

2018 ఐపీఎల్ సీజన్‌లో అంబటి రాయుడు 602 పరుగులు సాధించి చెన్నై విజేతగా నిలవటంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే 2019 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆల్‌రౌండర్ (3డీ) అనే కారణంతో విజయ్ శంకర్‌కు జట్టులో స్థానం దక్కింది. ఆ తర్వాత విజయ్ శంకర్, శిఖర్ ధావన్ గాయాలతో దూరమైనా.. రాయుడికి జట్టులో చోటు దక్కలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన తెలుగు తేజం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

Story first published: Thursday, September 24, 2020, 15:51 [IST]
Other articles published on Sep 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X