న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాయుడు తెలివైన బ్యాట్స్‌మన్, అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు: కోహ్లీ

India Vs West Indies 2018,4th ODI :Dhoni Falls A Run Short To Enter 10k ODI Club For India| Oneindia
Ambati Rayudu has grabbed opportunity with both hands: Virat Kohli

హైదరాబాద్: "అంబటి రాయుడు తనకు వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. 2019 వరల్డ్ కప్ వరకు మేం అతడికి మద్దతుగా నిలవాల్సి ఉంది" ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరిగిన నాలుగో వన్డే అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న మాటలివి.

ముంబై వన్డేలో భారత్ విజయం: ఐదు వన్డేల సిరిస్‌లో 2-1 ఆధిక్యంముంబై వన్డేలో భారత్ విజయం: ఐదు వన్డేల సిరిస్‌లో 2-1 ఆధిక్యం

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (162: 137 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సులు), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు(100: 81 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీలతో చెలరేగడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

153 పరుగులకే ఆలౌటైన వెస్టిండిస్

153 పరుగులకే ఆలౌటైన వెస్టిండిస్

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు 37.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ 224 భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అంబటి రాయుడు బ్యాటింగ్‌పై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు. చివరకు ఓ ఆటగాడు ఆ స్థానంలో తెలివిగా ఆడుతున్నాడని అన్నాడు.

 మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "అవకాశాన్ని రాయుడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 2019 ప్రపంచకప్‌ వరకు మేం అతడికి మద్దతుగా నిలవాల్సి ఉంది. ఆటను సరిగ్గా అర్థం చేసుకుంటూ రాయుడు ముందుకు సాగుతున్నాడు. ఎట్టకేలకు ఓ తెలివైన ఆటగాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని అన్నాడు.

 ఖలీల్‌ అహ్మద్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడు

ఖలీల్‌ అహ్మద్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడు

ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ తాము ఆధిపత్యాన్ని ప్రదర్శించామని కోహ్లీ తెలిపాడు. ఖలీల్‌ అహ్మద్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడని, బంతిని రెండువైపులా స్వింగ్‌ చేశాడని కోహ్లీ చెప్పాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ సైతం అంబటి రాయుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

అంబటి రాయుడిపై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం

అంబటి రాయుడిపై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం

వరల్డ్‌కప్ నేపథ్యంలో నాలుగో స్థానానికి తాను తగిన ఆటగాడిననే విషయంలో ఉన్న సందేహాలను రాయుడు తన సెంచరీతో తీర్చేశాడని రోహిత్‌ శర్మ అన్నాడు. ‘‘రాయుడు చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. నాలుగో స్థానానికి సంబంధించి అన్ని సమస్యలనూ అతడు పరిష్కరించాడు. ఇక ప్రపంచకప్‌ వరకు నంబర్‌-4పై చర్చ ఉండదని అనుకుంటున్నా" అని అన్నాడు.

ఒత్తిడిలో అతడు చక్కగా బ్యాటింగ్‌ చేశాడు

ఒత్తిడిలో అతడు చక్కగా బ్యాటింగ్‌ చేశాడు

"రాయుడు గొప్పగా బ్యాటింగ్‌ చేశాడు. భారీ భాగస్వామ్యం అవసరైన సమయంలో అతడు నిలబడ్డాడు. సత్తా చాటుకున్నాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డాక... ఒత్తిడిలో అతడు చక్కగా బ్యాటింగ్‌ చేశాడు. స్వేచ్ఛగా ఆడాడు. మాకు చాలా రోజులుగా రాయుడు తెలుసు. అతడి ప్రతిభ గురించీ తెలుసు" అని రోహిత్ శర్మ తెలిపాడు.

Story first published: Tuesday, October 30, 2018, 12:21 [IST]
Other articles published on Oct 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X