న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌లో చోటు దక్కకపోవడంపై ట్విట్టర్లో అంబటి రాయుడు వ్యంగ్యం!

ICC Cricket World Cup 2019 : Ordered 3D Glasses To Watch World Cup : Tweets Rayudu After Exclusion
Ambati Rayudu comes up with a sarcastic message on Twitter after the World Cup snub

హైదరాబాద్: వన్డే వరల్డ్‌కప్‌లో ఆడే భారత జట్టుని సెలక్టర్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. గత కొన్ని నెలలుగా ఈ జట్టులో చోటు దక్కించుకుంటారని భావించిన తెలుగు తేజం అంబటి రాయుడికి సెలక్టర్లు మొండిచేయి చూపించారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

రాయుడిపై కెప్టెన్ కోహ్లీ సైతం ప్రశంసలు

రాయుడిపై కెప్టెన్ కోహ్లీ సైతం ప్రశంసలు

ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అంబటి రాయుడిపై కెప్టెన్ కోహ్లీ సైతం ప్రశంసలు కురిపించాడు. రాయుడు NO.4 స్థానానికి చక్కగా సరిపోతాడని పేర్కొన్నాడు. అయితే, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో రాయుడు పేలవ ప్రదర్శన చేయడంతో సెలక్టర్లు రాయుడిని పరిగణనలోకి తీసుకోలేదు.

విజయ్ శంకర్‌వైపు సెలక్టర్లు మొగ్గు

విజయ్ శంకర్‌వైపు సెలక్టర్లు మొగ్గు

అదే సమయంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో అద్భుత ప్రదర్శన చేసిన విజయ్ శంకర్‌వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేసే సమయంలో అంబటి రాయుడు, విజయ్‌ శంకర్‌లలో ఎవరిని తీసుకోవాలనే దానిపై తీవ్ర చర్చ జరిగిందని, చివరికి విజయ్ శంకర్‌‌వైపు మొగ్గు చూపామని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.

శంకర్‌ మూడు రకాలుగా ఉపయోగపడతాడు

శంకర్‌ మూడు రకాలుగా ఉపయోగపడతాడు

"NO.4 స్పాట్‌లో అంబటి రాయుడు, విజయ్ శంకర్‌లకు పలు అవకాశాలు ఇచ్చాం. అయితే శంకర్‌ మూడు రకాలుగా ఉపయోగపడతాడు. శంకర్‌ బ్యాటింగ్‌, బౌలింగే కాదు మంచి ఫీల్డర్‌ కూడా. దీంతో శంకర్‌ వైపే మొగ్గు చూపాం. అంతేకాకుండా టీమిండియా చివరి రెండు సిరీస్‌లలో శంకర్‌ ఎంతగానో ఆకట్టుకున్నాడు" అని ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు.

ఎమ్మెస్కే వ్యాఖ్యలపై అంబటి రాయుడు వ్యంగ్యంగా

ఎమ్మెస్కే వ్యాఖ్యలపై అంబటి రాయుడు వ్యంగ్యంగా వచ్చే వరల్డ్‌కప్‌ను ‘3డీ' కళ్లద్దాలు పెట్టుకుని చూస్తానంటూ రాయుడు ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. "ఇప్పుడే 3d గ్లాసెస్ కోసం ఆర్డర్‌ చేశా. వచ్చే వరల్డ్‌కప్‌ను ఆ గ్లాసెస్‌తోనే చూస్తా" అంటూ ట్వీట్ చేశాడు. విజయ్‌ శంకర్‌ త్రీ డైమెన్షన్స్‌ ఉన్న ఆటగాడిగా ఎమ్మెస్కే పోల్చిన క్రమంలో రాయుడు ఈ విధంగా సెటైర్ వేశాడని అంటున్నారు.

Story first published: Tuesday, April 16, 2019, 19:56 [IST]
Other articles published on Apr 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X