న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళా దినోత్సవం రోజునే: హార్ధిక్ పాండ్య రికార్డును బ్రేక్ చేసిన అలీస్సా హీలీ

 Alyssa Healey breaks Hardhik Pandya Record, creates new history in ICC tournaments

మెల్‌బోర్న్: మహిళల టీట్వంటీ ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా - భారత్‌ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. భారత జట్టుపై 85 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఓ రికార్డు కూడా నమోదైంది. ఇది ఒక్క మహిళల క్రికెట్‌లోనే నమోదైన రికార్డు కాదు. పురుషుల క్రికెట్‌లో కూడా ఇలాంటి రికార్డు నమోదు కాలేదు. ఇంతకీ ఏంటా రికార్డు..? ఎవరు చేశారు..?

 సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన అలీస్సా హీలీ

సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన అలీస్సా హీలీ

మహిళల టీట్వంటీ ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్‌కు చెందిన ఓపెనింగ్ బ్యాటర్ అలిస్సా హీలీ ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటు పురుషులు అటు మహిళల క్రికెట్‌లో ఎవ్వరూ సాధించలేని ఫీట్‌ను ఆమె సాధించింది. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో హీలీ చేసిర అర్థశతకం రికార్డులకెక్కింది. మహిళల టీట్వంటీ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా భారత్‌ల మధ్య జరిగిన ఫైనల్లో హీలీ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశారు. ఇదీ ఐసీసీ నిర్వహించిన మెగా ఈవెంట్స్‌ల చరిత్రలోనే ఓ సరికొత్త రికార్డు. హీలీ 50 పరుగులను కేవలం 30 బంతుల్లోనే చేసింది.

 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన హార్ధిక్ పాండ్య

32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన హార్ధిక్ పాండ్య

అంతకుముందు ఈ రికార్డు భారత్‌కు చెందిన హార్ధిక్ పాండ్య పేరిట ఉండేది. 2017లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌ భారత్‌ల మధ్య జరిగిన ఫైనల్స్‌లో హార్ధిక్ పాండ్య 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును చెరిపివేసింది హీలీ. హార్థిక్ పాండ్య కంటే రెండు బంతులు తక్కువగా ఆడి 50 పరుగులు పూర్తి చేసింది. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 39 బంతుల్లో 75 పరుగులు చేసి హీలీ పెవీలియన్ బాట పట్టింది. మ్యాచ్ 12వ ఓవర్లో రాధా యాదవ్ హీలీ వికెట్ తీసింది.

 భారత మహిళల జట్టు ఘోర ఓటమి

భారత మహిళల జట్టు ఘోర ఓటమి

అంతకుముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు హీలీ, బెత్ మూనీ 115 పరుగులు జోడించి ఆస్ట్రేలియాను పటిష్ట స్థితిలో ఉంచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టును 99 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఐదోసారి ఐసీసీ టీట్వంటీ ప్రపంచ‌కప్‌ను సాధించింది.

Story first published: Sunday, March 8, 2020, 17:03 [IST]
Other articles published on Mar 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X