న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్ పూర్తి ఫార్మాట్ ఇదే.. ఈ‌సారి గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎన్ని ఉన్నాయంటే..?

 All You Need to Know About Asia cup Format and Winning percentage

ఆసియాకప్ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటాయనే సంగతి తెలిసిందే. అందులో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు నేరుగా క్వాలిఫై కాగా.. 6వ జట్టు మాత్రం క్వాలిఫయర్ రౌండ్లో గెలిచి అర్హత సాధించాల్సి ఉంటుంది. క్వాలిఫయర్ రౌండ్‌లో హాంకాంగ్, కువైట్, సింగపూర్, యూఏఈ జట్లు తలపడతాయి. ఇందులో నంబర్ 1 స్థానంలో నిలిచిన జట్టు 6వ టీంగా ఎంపికవుతుంది. ఇక క్వాలిఫయర్ రౌండ్ మ్యాచ్‌లు ఆగస్టు 20 నుంచి 26 మధ్య జరుగుతాయి. ఆగస్టు 27నుంచి మెయిన్ ఆసియా కప్ ప్రారంభమవుతుంది.

ఫైనల్ చేరాలంటే ఇలా..

ఆసియా కప్ 2022లో 6జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. గ్రూప్ 1లో భారత్, పాకిస్థాన్, క్వాలిఫయర్ జట్టు ఉన్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతాయి. రెండు గ్రూపుల్లో టాప్ 2స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ 4రౌండ్లో ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇక ఫైనల్లో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఇక ఇప్పటివరకు భారత్ మరియు పాకిస్థాన్ బోర్డులు మాత్రమే ఆసియా కప్ 2022 కోసం తమ జట్లను ప్రకటించాయి. భారత్ తమ కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించగా, పాకిస్తాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌ ఆ జట్టును నడిపించనున్నాడు.

ఆసియాకప్ భారత్, పాక్ టీంలు

భారత్ : రోహిత్ శర్మ ( కెప్టెన్ ), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.

స్టాండ్‌బై: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.

పాకిస్థాన్ : బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షానవాజ్ దహానీ ఖదీర్.

విన్నింగ్ పర్సంటేజీ అంచనా

విన్నింగ్ పర్సంటేజీ అంచనా

ఇక ఆసియా కప్ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ జట్టుగా భారత్ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆసియాకప్ టైటిల్ గెలిచే అవకాశాలను ప్రముఖ క్రికెట్ సైట్ క్రిక్ ట్రాకర్ వెల్లడించింది. క్రిక్ ట్రాకర్ ప్రకారం.. భారత్ 42శాతం, పాకిస్థాన్ 34, శ్రీలంక 12, బంగ్లాదేశ్ 6, ఆఫ్ఘనిస్థాన్ 4, యూఏఈ 2 శాతం విజయవకాశాలను కలిగి ఉన్నాయి.

Story first published: Thursday, August 11, 2022, 20:06 [IST]
Other articles published on Aug 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X