న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అల్గోబ్యాట్: మ్యాథమెటికల్‌ అల్గారిథమ్స్‌ ఉపయోగించి సరికొత్త బ్యాట్

Algobat: Scientists Develop Algorithm For Affordable, High-Performing Cricket Bat || Oneindia Telugu
Algobat: Scientists develop algorithm for affordable, high-performing cricket bat

హైదరాబాద్: కెనెడాలోని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్‌ బ్యాట్‌ తయారు చేసేందుకు శ్రీకారం చుట్టారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో, మ్యాథమెటికల్‌ అల్గారిథమ్స్‌ ఉపయోగించి ఓ సరికొత్త బ్యాట్‌ని రూపొందించారు. దాని పేరు అల్గో బ్యాట్‌.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మార్కెట్‌లో ఉన్న అత్యుత్తమ బ్యాట్‌కు ధీటుగా

మార్కెట్‌లో ఉన్న అత్యుత్తమ బ్యాట్‌కు ధీటుగా

ఈ కొత్త బ్యాట్‌ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అత్యుత్తమ బ్యాట్‌కు ఏమాత్రం తీసిపోదని.. అందరికీ అందుబాటులోనే ధర ఉంటుందని ఫిల్‌ ఎవన్స్‌ అనే శాస్త్రవేత్త అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడేవారు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. క్లోహ్లీ, స్మిత్, మోర్గన్‌ వంటి ఆటగాళ్ల స్ఫూర్తిగా క్రికెట్‌లోకి అడుగుపెట్టే చిన్నారులకు మంచి బ్యాట్‌ కొనడం ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది.

లక్షలాది చిన్నారుల ఆశలను

లక్షలాది చిన్నారుల ఆశలను

అలాంటి లక్షలాది చిన్నారుల ఆశలను తీర్చాలన్న ఉద్దేశంతో దీనిని రూపొందించారు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి బ్యాట్‌ ఖరీదు లక్షల్లో ఉండగా.. తమ ఆల్గోబ్యాట్‌ ఖరీదు రెండు మూడు వేల కంటే ఎక్కువ ఉండదని ఈ బ్యాట్‌ని రూపొందించిన ఫిల్‌ ఎవన్స్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. ప్రస్తుతం ఈ బ్యాట్ ప్రయోగ దశలోనే ఉందని, త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నట్లు తెలిపారు.

బ్యాట్‌ జ్యామితిని మార్చడం ద్వారా

బ్యాట్‌ జ్యామితిని మార్చడం ద్వారా

బ్యాట్‌ జ్యామితిని మార్చడం ద్వారా బంతి తగిలినప్పుడు అతితక్కువ కంపించడం, తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం వెళ్లడం ఈ ఆల్గోబ్యాట్‌ ప్రత్యేకతలని ఆయన తెలిపారు. ఆల్గోబ్యాట్‌ డిజైన్‌తో సాధారణ కలపతోనూ అత్యుత్తమమైన బ్యాట్‌లు తయారు చేయొచ్చని, ఆయా కలప రకానికి తగ్గట్లు డిజైన్‌ మార్చుకునే అవకాశం ఉంటుందని అన్నారు.

అల్గోబ్యాట్‌ వెనుక భాగం ఆకారం అద్భుతం

అల్గోబ్యాట్‌ వెనుక భాగం ఆకారం అద్భుతం

"అదరడం తగ్గితే బ్యాటు.. మరింత బలంగా బంతిని తాకుతుంది. అల్గోబ్యాట్‌ వెనుక భాగం ఆకారం అద్భుతం. అది కంపనాన్ని తగ్గిస్తుంది. బ్యాట్స్‌మన్‌ పూర్తి శక్తి షాట్లోకి వెళ్తుంది" అని అల్గోబ్యాట్‌ రూపొందించిన వారిలో ఒకరైన మజ్లూమీ చెప్పాడు. సాధారణ చెక్కను ఉపయోగించి కూడా నాణ్యమైన బ్యాట్‌ను తయారు చేయొచ్చు.

Story first published: Thursday, July 18, 2019, 11:35 [IST]
Other articles published on Jul 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X