న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లో రికార్డులివే: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అలెస్టర్ కుక్

By Nageshwara Rao
Alastair Cook retires from international cricket

హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు చేదువార్త. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ప్రకటించాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా సెప్టెంబర్ 7(శుక్రవారం) నుంచి భారత్‌తో మొదలయ్యే చివరి టెస్టే తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ అని కుక్ ప్రకటించాడు.

తన రిటైర్మెంట్‌పై కుక్ మాట్లాడుతూ "రిటైర్మెంట్ ప్రకటించడం బాధాకరమే అయినా నేను క్రికెట్ కోసం అన్నీ ఇచ్చానన్న సంతృప్తి నాకు ఉంది. నేను ఎప్పుడూ ఊహించని రికార్డులను సాధించాను. ఇంగ్లండ్ జట్టులో ఇంతకాలంగా నేను ఆడటం ఎంతో సంతోషంగా.. గౌరవంగా ఉంది. ఇక కొందరు జట్టు సభ్యులతో డ్రెస్సింగ్ రూంని పంచుకోలేను అని తెలిసి కాస్త బాధగా ఉంది. కానీ ఇందుకు ఇదే సరైన సమయం" అని కుక్ చెప్పాడు.

"నేను పిల్లాడిగా మా గార్డెన్‌లో క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి క్రికెట్ అంటే నాకు ప్రాణం. ఇంగ్లండ్ షర్ట్‌ని తీసేయం చాలా కష్టమే.. కానీ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని, యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు దక్కాలనే ఇది చేస్తున్నాను. వాళ్లు మా దేశానికి ప్రతినిధ్యం వహించి మనల్ని మరింత అలరించాలని కోరుకుంటున్నా'' అని కుక్ తెలిపాడు.

ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన

ఈ మేరకు సోమవారం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తన ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. 33 ఏళ్ల కుక్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరోస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ జట్టు తరుపున అలెస్టర్ కుక్ అనేక రికార్డులను నమోదు చేశాడు. ఇప్పటివరకు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు తరుపున 160 టెస్టులు ఆడిన కుక్.. 12254 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో కుక్ యావరేది 44.88గా ఉంది. 2016లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న అతి చిన్న క్రికెటర్‌గా రికార్డు కుక్ సృష్టించాడు.

అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా

ఈ ఫీట్‌ని అతను 31 సంవత్సరాల, 157 రోజుల్లో సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఒకనొక దశలో కుక్ ఫామ్‌ని చూసి సచిన్ రికార్డులు బద్ధలు కొడతాడని భావించారు. గత, కొంతకాలంగా కుక్ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో అతని సగటు కేవలం 18.62 మాత్రమే. ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌‌ల సిరిస్‌లో కుక్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

కుక్‌కు ఇదే తొలిసారి

కుక్‌కు ఇదే తొలిసారి

మూడు అంతకన్నా ఎక్కువ టెస్టుల్లో కనీసం యాభైకి పైగా స్కోరు కూడా చేయకపోవడం కుక్‌కు ఇదే తొలిసారి. 2008 నుంచి ఒక క్యాలెండర్ ఇయర్ తొలి తొమ్మిది టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోవడం కూడా అతనికి ఇదే తొలిసారి. టెస్టు క్రికెట్ చరిత్రలో 6వేలు, 7వేలు, 8వేలు, 9వేలు, 10వేలు, 11వేలు, 12 వేల పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా కుక్ అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టుకు 59 టెస్టుల్లో కెప్టెన్సీ కూడా వహించాడు. 2013, 2015 యాషెస్ సిరీస్‌లు గెలవడం అలెస్టర్ కుక్ జీవితంలో మరిచిపోలేని సిరిస్‌లు. ఇండియా, దక్షిణాఫ్రికాల్లో సిరీస్ విజయాలు సాధించిన ఘనత కూడా అలెస్టర్ కుక్ సొంతం.

అంతర్జాతీయ క్రికెట్‌లో అలెస్టర్ కుక్ రికార్డులు:

ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు: 12254

ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు: 32

ఇంగ్లండ్ తరఫున అత్యధిక 150+ స్కోర్లు : 11

ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు : 160

విరామం లేకుండా అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్ : 158 టెస్టులు

ఇంగ్లండ్ కెప్టెన్‌గా అత్యధిక టెస్టులు: 59

Story first published: Monday, September 3, 2018, 18:20 [IST]
Other articles published on Sep 3, 2018
Read in English: Alastair Cook retires
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X