న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండిస్‌తో ఐదు వన్డేల సిరిస్: ధోనికి విశ్రాంతినిచ్చి పంత్‌ను ఆడించండి

India vs West indies 2018:1st Test 3rd Day : Dhoni Should Be Replaced With Rishah Panth:Ajit Agarkar
Ajit Agarkar bats for Rishabh Pants inclusion for West Indies ODIs

హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ అనంతరం వెస్టిండిస్ జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌‌‌ని ఆడించాలని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ సూచించాడు. ఇటీవలే ఇంగ్లీషు గడ్డపై ఇంగ్లాండ్‌‌ జట్టుతో ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో రిషబ్ పంత్ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

తృటిలో రనౌట్ మిస్సయ్యేది: జడేజాపై కోప్పడ్డ కోహ్లీ, అశ్విన్ (వీడియో వైరల్)తృటిలో రనౌట్ మిస్సయ్యేది: జడేజాపై కోప్పడ్డ కోహ్లీ, అశ్విన్ (వీడియో వైరల్)

రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లోనూ 84 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సలు సాయంతో 92 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 21 నుంచి వెస్టిండీస్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లోనూ రిషబ్ పంత్‌ను ఆడించాలని అజిత్ అగర్కార్ సెలక్టర్లకు సూచించాడు.

ఈ సందర్భంగా అగార్కర్ మాట్లాడుతూ "వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ కోసం రిషబ్ పంత్‌ని సెలక్టర్లు జట్టులోకి ఎంపిక చేస్తారని నేను అనుకుంటున్నా. సిరీస్‌లో ఐదు వన్డేలు ఉండటంతో.. అవకాశాన్ని బట్టి కనీసం రెండు వన్డేల్లోనైనా అతడ్ని ఆడించాలి. అది వికెట్ కీపర్‌గా అయితే బాగుంటుందని నా భావన" అని అన్నాడు.

"ఎందుకంటే.. ధోనీ సత్తా ఏంటో? అందరికీ తెలుసు. కొత్తగా అతను నిరూపించుకోవాల్సింది అవసరం ఏమీ లేదు. దీంతో ఓ రెండు వన్డేల్లో ధోనీకి రెస్ట్ ఇస్తే వచ్చే నష్టమేమీ ఉండదు" అని అజిత్ అగార్కర్ తెలిపాడు. గత ఐదారు నెలలుగా ధోనితో పాటు ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ని వన్డేల్లోకి సెలక్టర్లు ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే.

1
44264

న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం: పృథ్వీ షానే మరో సచిన్ టెండూల్కరా?న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం: పృథ్వీ షానే మరో సచిన్ టెండూల్కరా?

ఇక, టెస్టుల్లో వృద్ధిమాన్ సాహాకు సెలక్టర్లు ధోని స్ధానాన్ని కట్టబెట్టారు. అయితే, వృద్ధిమాన్ సాహా గాయపడటంతో అతడి స్థానంలో టెస్టుల్లో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని ఎంపిక చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండిస్ జట్టు 29 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోస్టన్ చేజ్(27), కీమో పాల్(13) పరుగులతో ఉన్నారు.

Story first published: Friday, October 5, 2018, 19:26 [IST]
Other articles published on Oct 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X