న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నైలో చెత్త పిచ్‌లు.. టీ20 క్రికెట్‌కు పనికిరాని వికెట్స్.. మాజీ క్రికెటర్ల ఫైర్!

Ajit Agarkar and Ben Stokes slams the pitch used for PBKS vs MI match

న్యూఢిల్లీ: మరోసారి చెన్నై‌లో చెపాక్ స్డేడియం పిచ్‌లపై రగడ మొదలైంది. భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సందర్భంగా ఈ పిచ్‌పై పెనుదుమారం రేగిన విషయం తెలిసిందే. అసలు టెస్ట్ క్రికెట్ పనికిరాని పిచ్‌లను సిద్దం చేశారని మాజీ క్రికెటర్ల విమర్శలు గుప్పించారు. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్ సందర్బంగా కూడా మళ్లీ అవే విమర్శలు వినిపిస్తున్నాయి. వికెట్ టర్నింగ్‌కు అనుకూలిస్తుండటంతో బ్యాట్స్‌మన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు డ్యూ ప్రభావం కూడా ఉంటుండతో బ్యాట్స్‌మెన్‌కు రన్స్ సాధించడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలోనే చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లన్నీ లో స్కోరింగ్ గేమ్స్‌గా ముగుస్తున్నాయి.

చెత్త పిచ్..

తాజాగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడాఇదే రిపీట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ అతి కష్టమ్మీద 131 రన్స్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ పిచ్‌లు చెత్తగా ఉన్నాయంటూ టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్, ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ విమర్శించారు. ఐపీఎల్ జరిగే కొద్దీ పిచ్‌లు మరింత దారుణంగా తయ్యారయ్యాయని ఈ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ ట్వీట్ చేశాడు. 'ఐపీఎల్ జరిగే కొద్ది పిచ్​లు మరింత దారుణంగా తయారయ్యాయి అనుకుంటున్నా. ఇలాంటి లీగ్​లో 160/170 అనేది మినిమన్ స్కోర్. కానీ 130/140 పరుగులు అంటే పిచ్ బాగోలేదని అర్థం" అంటూ ట్వీట్ చేశాడు. ఇక గాయంతో స్టోక్స్ ఈ లీగ్ నుంచి అర్దాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే.

ఆర్డీనరి పిచ్‌లు..

ఆర్డీనరి పిచ్‌లు..

అజిత్ అగార్కర్ సైతం పిచ్‌లు చాలా ఆర్డీనరీగా ఉన్నాయని విమర్శించాడు. వరుసగా మ్యాచ్‌లు ఉండటంతో గ్రౌండ్స్‌మెన్‌కు పిచ్‌లను సిద్దం చేసే సమయం సరిపోవడం లేదన్నాడు. 'చెన్నైలో వేడి, మైదాన సిబ్బందికి కావాల్సిన టైమ్ అందుబాటులో లేకపోవడంతో ఈ తరహా పిచ్‌లు చూడాల్సి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. కానీ రాను రాను పిచ్‌లు మరింత అధ్వాన్నంగా తయారవుతున్నాయి. పంజాబ్ కింగ్స్-ముంబై మ్యాచ్ పిచ్ అయితే చాలా కఠినంగా ఉంది. ఇది చాలా సాధారణ వికెట్.'అని చెప్పుకొచ్చాడు.

స్వల్ప లక్ష్యాలు కూడా..

స్వల్ప లక్ష్యాలు కూడా..

132 పరుగుల స్వల్ప లక్ష్యచేధనలో మిడిల్ ఓవర్లలో రన్‌రేట్ తగ్గినప్పుడు పంజాబ్ క్యాంప్‌లో భయాందోళన నెలకొందని అజిత్ అగార్కర్ తెలిపాడు. ఆరంభంలో కొంచెం తడబడినా పంజాబ్‌కు చేజింగ్ కష్టమయ్యేదన్నాడు. 'ఓ మాజీ బౌలర్‌గా ఈ రకమైన పిచ్‌లపై నాకు ఎలాంటి సమస్యలేదు. సాధారణంగా 150-160 స్కోర్లను చాలా తేలికగా చేధిస్తారు. కానీ ఈ పిచ్‌పై 160 పరుగులు చేస్తే ఏ జట్టు కూడా లక్ష్యాన్ని అందుకోలేదని నేను కచ్చితంగా చెప్పగలను'అని అగార్కర్ తెలిపాడు.

హయ్యెస్ట్ స్కోర్ ఎంతంటే..?

హయ్యెస్ట్ స్కోర్ ఎంతంటే..?

చెన్నై చెపాక్ మైదానంలో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు జరగ్గా ఒకే ఒక మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదైంది. అది కూడా బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పైన ఆర్‌సీబీ 4 వికెట్లకు 204 పరుగులు చేయగా.. చేజింగ్‌లో కేకేఆర్ 166 పరుగులకే పరిమితమై ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 187 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ 177 రన్స్ చేసి ఓటమిపాలైంది. ఈ తొమ్మిది మ్యాచ్‌ల్లో మూడు సార్లు మాత్రమే చేజింగ్ టీమ్స్ నెగ్గాయి. అది కూడా వారి ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కు పరిమితం చేసి విజయం సాధించాయి.

Story first published: Saturday, April 24, 2021, 15:02 [IST]
Other articles published on Apr 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X