న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఫైనల్ ముందు రాజస్థాన్, గుజరాత్ ప్లేయర్లను ఊరిస్తున్న రికార్డులు ఇవే

Ahead Of IPL final match some players are reaching and nearer to Few milestones

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2022 క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించిన సంగతి తెలిసిందే. ఈ విజయం ద్వారా మే 29న గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఐపీఎల్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫైనల్ ముంగిట ఇరు జట్లకు చెందిన పలువురు క్రికెటర్లు కొన్ని మైలురాళ్లకు చేరువలో ఉన్నారు. ఆ మైలురాళ్లు ఏంటో ఓసారి చూసేద్దామా.

1. 4సిక్సర్లు: ఐపీఎల్‌లో 50సిక్సుల మార్క్ చేరుకోవడానికి గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో నాలుగు సిక్సర్లు కొట్టాలి. ప్రస్తుతం గిల్ 46సిక్సర్లతో కొనసాగుతున్నాడు.
2. 25పరుగులు: రాజస్థాన్ విధ్వంసక ఓపెనర్ జోస్ బట్లర్ ఒక సీజన్లో (824పరుగులు) అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలవడానికి మరో 25పరుగులు చేయాలి. తద్వారా డేవిడ్ వార్నర్ (848)రికార్డును అతను అధిగమించగలడు. విరాట్ కోహ్లీ (973)తర్వాత రెండో స్థానంలో నిలువగలుగుతాడు.
3. 1వికెట్ : ఐపీఎల్లో ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా అవతరించడానికి యుజ్వేంద్ర చాహల్ ఒక వికెట్ తీయాలి. తద్వారా ఇమ్రాన్ తాహిర్, వనిందు హసరంగా (26)లను అతను దాటి తొలి స్థానానికి చేరుకుంటాడు.
4. 2 వికెట్లు : ఐపీఎల్లో 100వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి మహ్మద్ షమీకి మరో రెండు వికెట్లు అవసరం. ప్రస్తుతం షమీ 98వికెట్లతో కొనసాగుతున్నాడు. రెండు వికెట్లు అవసరం.
5. 7ఫోర్లు, 1ఇన్నింగ్స్: ఐపీఎల్లో 150ఫోర్లు కొట్టిన ప్లేయర్ గా నిలవడానికి హార్దిక్ పాండ్యా మరో 7ఫోర్ల దూరంలో ఉన్నాడు. అలాగే ఒక్క ఇన్నింగ్స్ ఆడితే 100 ఇన్నింగ్స్ కు చేరుకుంటాడు.
6. 2వికెట్లు: ఐపీఎల్‌లో 50 వికెట్ల మైలురాయి చేరుకోవడానికి ప్రసిద్ధ్ కృష్ణ మరో రెండు వికెట్లు తీయాలి.
7. 38పరుగులు: ఐపీఎల్లో 4000పరుగుల రికార్డు చేరుకోవడానికి వృద్ధిమాన్ సాహా (3962) మరో 38 పరుగులు చేయాలి.
8. 1వికెట్ : పియూష్ చావ్లా (157)తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా అవతరించడానికి అశ్విన్ మరో వికెట్ తీయాలి. మరో 20పరుగులు చేస్తే టీ20ల్లో 1000 పరుగుల మార్క్ చేరుకుంటాడు.
9. 5ఫోర్లు: T20 క్రికెట్‌లో 300ఫోర్లు అందుకోవడానికి మాథ్యూ వేడ్ (295)కు మరో ఐదు ఫోర్లు అవసరం.
10. 3ఫోర్లు : రాజస్థాన్ తరఫున 250ఫోర్ల మైలురాయి చేరుకోవడానికి సంజు శాంసన్ మరో మూడు ఫోర్లు బాదాలి.
11. అమిత్ మిశ్రా (166)తర్వాత ఐపీఎల్లో మూడో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడానికి చాహల్ (165)కు రెండు వికెట్లు అవసరం.

Story first published: Saturday, May 28, 2022, 17:22 [IST]
Other articles published on May 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X