న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెహ్వాగ్ దారిలో వెంకటేశ్ ప్రసాద్: బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా!

 After Virender Sehwag, Venkatesh Prasad also quits Kings XI Punjab: Report

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో మరో కుదుపు. ఇప్పటికే, వచ్చే సీజన్‌లో ఆ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం లేదని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రకటించి ఒక్క రోజు కూడా గడవకముందే ఆ జట్టు బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి వెంకటేశ్ ప్రసాద్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

<strong>ఐపీఎల్ 2019: ముంబై, పంజాబ్ జట్లలో ప్రధాన మార్పులు</strong>ఐపీఎల్ 2019: ముంబై, పంజాబ్ జట్లలో ప్రధాన మార్పులు

టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ మేరకు కథనం ప్రసారమైంది. ఈ ఏడాది మొదట్లో జూనియర్ సెలక్షన్ ప్యానెల్‌లో ఛీఫ్ సెలక్టర్‌గా ఉన్న వెంకటేశ్ ప్రసాద్ ఆ పదవికి రాజీనామా చేసి పంజాబ్ జట్టులో చేరిన సంగతి తెలిసిందే. రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి అటు బీసీసీఐలోనూ, ఇటూ ఐపీఎల్‌లోనూ ఒకేసారి విధులు నిర్వర్తించకూడదు.

అందుకే బీసీసీఐలో జూనియర్ సెలక్షన్ ఛీఫ్ సెలక్టర్‌గా ఉన్న వెంకటేశ్ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశాడు. కేవలం ఒక్క సీజన్‌కు మాత్రమే బౌలింగ్ కోచ్‌గా పంజాబ్ జట్టుకు పనిచేశాడు. పంజాబ్ జట్టుకు సెహ్వాగ్ మెంటార్‌గా ఉన్న సమయంలో వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ కోచ్ బాధ్యతలు స్వీకరించాడు.

పంజాబ్ బౌలింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న ప్రసాద్

పంజాబ్ బౌలింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న ప్రసాద్

అయితే, ఇప్పుడు సెహ్వాగ్ తన మెంటార్ పదవి నుంచి తప్పుకోవడంతో వెంకటేశ్ ప్రసాద్ కూడా తన కోచింగ్ పదవి నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత వారంలోనే ఐపీఎల్ 2019 సీజన్ కోసం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ న్యూజిలాండ్‌ జాతీయ జట్టు మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించింది.

వెంకటేశ్ ప్రసాద్ స్థానంలో శ్రీధరన్ శ్రీమాన్‌

వెంకటేశ్ ప్రసాద్ స్థానంలో శ్రీధరన్ శ్రీమాన్‌

ఇదిలా ఉంటే మాకు అందుకున్న సమాచారం ప్రకారం వెంకటేశ్ ప్రసాద్ స్థానంలో శ్రీధరన్ శ్రీమాన్‌ పంజాబ్ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీధరన్ శ్రీమాన్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో శ్రీధరన్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో కలిసి బ్యాక్‌రూమ్ స్టాఫ్‌గా పనిచేశారు.

అధికారిక ప్రకటన చేసిన సెహ్వాగ్

అధికారిక ప్రకటన చేసిన సెహ్వాగ్

కాగా, శనివారం వీరేంద్ర సెహ్వాగ్‌ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో తాను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా వ్యవహరించడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014, 2015లలో కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు తరఫున ఆడిన సెహ్వాగ్‌ ఆ తర్వాత మూడు సీజన్లుగా మెంటార్‌ వ్యవహారిస్తున్నాడు. అయితే, తన పదవి నుంచి తప్పుకున్న సెహ్వాగ్‌ తనంతట తానుగా బయటకు రాలేదని తెలిపాడు.

నిర్ణయం ఫ్రాంచైజీదేనన్న సెహ్వాగ్

నిర్ణయం ఫ్రాంచైజీదేనన్న సెహ్వాగ్

ఈ నిర్ణయం ఫ్రాంచైజీదేనని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. "ఫ్రాంచైజీ నుంచి నాకు ఒక మెయిల్‌ వచ్చింది. తమకు ఇకపై బ్రాండ్‌ అంబాసిడర్‌ కానీ లేదా మెంటార్‌ కానీ అవసరం లేదని వారు అందులో తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు పంజాబ్‌ జట్టులో భాగంగా ఉండటం సంతోషం. నేను తప్పుకోవాలనేది వారి నిర్ణయం. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. గతంలో ఒకసారి ప్రీతి జింటాతో చెలరేగిన వివాదానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. వారు కొత్త మెంటార్‌ లేదా కొత్త అంబాసిడర్‌ కావాలని కోరుకుంటే అది వారి ఇష్టం" అని సెహ్వాగ్‌ చెప్పాడు.

Story first published: Monday, November 5, 2018, 15:36 [IST]
Other articles published on Nov 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X