న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Test championship: ఇంగ్లాండ్‌పై గెలుపుతో అగ్రస్థానంలో సౌతాఫ్రికా.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే?

After Southafrica Defeated England How the WTC Points Table Is?

మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. ఇటీవల న్యూజిలాండ్‌ను, భారత్‌‌ను వరుసగా ఓడించిన ఇంగ్లాండ్ ఊపును సౌతాఫ్రికా ఊదేసింది. ఐకానిక్ లార్డ్స్‌ గ్రౌండ్లో ఇంగ్లాండ్‌‌కు పెట్టని కోట లాంటి గ్రౌండ్లో.. ఏకంగా ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ఓడించింది. భీకరమైన పేస్ అటాక్‌కు బాజ్‌బాల్ సేన చిత్తయింది. ఇంగ్లాండ్ జట్టు పూర్తిస్థాయి టెస్ట్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, ప్రధాన కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లాండ్ సేనకు ఇది తొలి ఓటమి.

3మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యం సాధించడంతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో తమ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇకపోతే డీన్ ఎల్గర్ సారథ్యంలో దక్షిణాఫ్రికా టీం 2022లో ఇప్పటివరకు ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. ఈ మ్యాచ్‌లో 7వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటర్ల తుక్కురేగ్గొట్టిన రబాడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అగ్రస్థానంలో పాతుకుపోతున్న దక్షిణాఫ్రికా

అగ్రస్థానంలో పాతుకుపోతున్న దక్షిణాఫ్రికా

ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల విషయానికొస్తే.. ప్రస్తుతం 75శాతం విన్నింగ్ పర్సంటేజీ (పీసీటీ)తో దక్షిణాఫ్రికా WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా 70శాతంతో రెండో స్థానంలో నిలిచింది.

గత నెలలో శ్రీలంకలో ఓటమికి ముందు ఆసీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో నంబర్ వన్ పొజిషన్లో ఉండేది. అయితే రెండో టెస్టులో శ్రీలంక చేతిలో ఆసీస్ ఓడడంతో.. ఆ జట్టు ఓ స్థానం దిగజారి రెండో స్థానానికి పడిపోయింది. ఇక శ్రీలంక 53.33%శాతంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో మూడో స్థానానికి చేరుకుంది.

వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో..

గత నెలలో ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్ చేయబడిన అయిదో టెస్ట్ మ్యాచ్‌లో ఓటమితో భారత్ విన్నింగ్ పర్సంటేజీ తగ్గిపోయింది. ప్రస్తుతం భారత విన్నింగ్ పర్సంటేజీ 52.08శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక భారత్‌కు దరిదాపుల్లోనే పాకిస్థాన్ (51.85%), వెస్టిండీస్ (50%) శాతాలతో ఐదు, ఆరో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక భారత్ ముందు ఆస్ట్రేలియా లాంటి జట్టును టెస్టుల్లో ఎదుర్కోవాల్సి ఉంది.

చివరి మూడు స్థానాల్లో..

చివరి మూడు స్థానాల్లో..

ఇకపోతే దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత ఇంగ్లాండ్ మళ్లీ తన విన్నింగ్ పర్సంటేజీని స్వల్పంగా కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 31.37% PCTతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ అయిన న్యూజిలాండ్ 25.93% పాయింట్ల శాతంతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. ఇక ఆ జట్టు టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆశలు వదులుకోవాల్సిందే. ఇక బంగ్లాదేశ్ 13.33% PCTతో అట్టడుగున తొమ్మిదో స్థానంలో ఉంది.

Story first published: Friday, August 19, 2022, 22:53 [IST]
Other articles published on Aug 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X