న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీఏకు మరో షాక్: మెల్‌బోర్న్ పిచ్‌కి ఐసీసీ ‘యావరేజ్’ రేటింగ్

After Perth, MCG pitch gets average rating from ICC

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) పిచ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 'యావరేజ్' రేటింగ్ ఇచ్చింది. గత ఆదివారంతో ముగిసిన ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు 137 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత క్రికెట్ జట్టు 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో టెస్టు ముగిసిన అనంతరం మెల్ బోర్న్ పిచ్‌పై ఐసీసీ నివేదికని విడుదల చేసింది. రెండో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన పెర్త్ పిచ్‌కి కూడా ఐసీసీ యావరేజ్ రేటింగే ఇచ్చిన సంగతి తెలిసిందే.

1
43626
 తొలి ఇన్నింగ్స్‌ను 443/7తో డిక్లేర్ చేసిన భారత్

తొలి ఇన్నింగ్స్‌ను 443/7తో డిక్లేర్ చేసిన భారత్

ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి రెండు రోజులు క్రీజులో పాతుకుపోయారు. ముఖ్యంగా పుజారా (106) సెంచరీతో మెరవగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (82) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 443/7తో డిక్లేర్ చేసింది. మూడో రోజు నుంచి పిచ్ బౌన్స్‌కు సహకరించడంతో బ్యాటింగ్ చేయడం కష్టమైపోయింది.

 బౌలర్లకి ఈ పిచ్‌ నుంచి అతిగా సహకారం

బౌలర్లకి ఈ పిచ్‌ నుంచి అతిగా సహకారం

బౌలర్లకి ఈ పిచ్‌ నుంచి అతిగా సహకారం లభించడంతో జస్ప్రీత్ బుమ్రా (6/33) చెలరేగిపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 151 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే, ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ, కోహ్లీ అలా చేయకుండా రెండో ఇన్నింగ్స్‌ను 106/8 వద్ద డిక్లేర్ చేశాడు.

399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్

దీంతో ఆతిథ్య జట్టుకు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆతిథ్య జట్టు 261 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో టీమిండియా 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం పిచ్‌ నుంచి అస్థిర బౌన్స్‌‌ని చూసిన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ‘యావరేజ్‌' రేటింగ్‌‌తో ఐసీసీకి నివేదిక సమర్పించాడు.

గురువారం నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు

గురువారం నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు

కాగా, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జనవరి 3(గురువారం) నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. నాలుగో టెస్ట్ మ్యాచ్‌కి కూడా జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీ‌గా వ్యవహరించనున్నాడు.

Story first published: Tuesday, January 1, 2019, 13:08 [IST]
Other articles published on Jan 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X