అదే చివరి మ్యాచ్: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆశిష్ నెహ్రా గుడ్ బై?

Posted By:

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో అనూహ్యాంగా చోటు దక్కించుకుని టీమిండియా వెటరన్ క్రికెట్ ఆశిష్ నెహ్రా అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. సుమారు తొమ్మిది నెలల విరామం తర్వాత నెహ్రా ఆసీస్‌తో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరిస్‌లో బీసీసీఐ ఎంపిక చేసిన 15మంది జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

అయితే, రాంచీలో జరిగిన తొలి టీ20 కోసం ఎంపిక చేసిన తుది జట్టులో మాత్రం నెహ్రాకి స్థానం దక్కలేదు. ఇరు జట్ల మధ్య మంగళవారం గువహటి వేదికగా రెండో టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌కు ఆశిష్‌ నెహ్రా త్వరలోనే వీడ్కోలు పలుకుతున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది. ఈ వార్త నిజమేనని క్రికెట్ నిపుణులు సైతం అంటున్నారు.

After comeback to Virat Kohli's Team India, Ashish Nehra to announce retirement?

అయితే నెహ్రా రిటైర్మెంట్ ప్రకటించేది ప్రస్తుతం ఆసీస్‌తో జరిగే సిరిస్‌లో కాదు. ఆసీస్‌ పర్యటన అనంతరం న్యూజిలాండ్ భారత పర్యటనకు రానుంది. ఈ క్రమంలో నవంబరు 1న ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లోనే నెహ్రా రిటైర్మెంట్‌ ప్రకటించాలని యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇందుకు కారణం కూడా ఉంది. నెహ్రా సొంత స్టేడియం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం. సొంత మైదానంలో అభిమానుల మధ్య వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. నెహ్రా చివరిసారిగా ఈ ఏడాది ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో భారత్ తరుపున ఆడాడు. ఇప్పటి వరకు 26 టీ20లు ఆడిన నెహ్రా 34 వికెట్లు తీశాడు.

Story first published: Tuesday, October 10, 2017, 17:52 [IST]
Other articles published on Oct 10, 2017
Please Wait while comments are loading...
POLLS