న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీబీఎల్: అరంగేట్ర మ్యాచ్‌లోనే ముజీబ్ ఉర్ రెహ్మాన్ రికార్డుల మోత

Afghanistan spinner Mujeeb Ur Rahman enters the record books after a batting cameo

హైదరాబాద్: బిగ్ బాష్ లీగ్‌లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే ఆప్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ రికార్డుల మోత మోగించాడు. టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి అడిలైడ్ స్ట్రైకర్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముజీబ్... జేమ్స్ పియర్సన్‌తో కలిసి చివరి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

కోహ్లీ గొప్ప ఆటగాడు, బుమ్రా బౌలింగ్ అంటే ఎంతో ఇష్టం: డెన్నిస్ లిల్లీకోహ్లీ గొప్ప ఆటగాడు, బుమ్రా బౌలింగ్ అంటే ఎంతో ఇష్టం: డెన్నిస్ లిల్లీ

బిగ్ బాష్ లీగ్‌లో చివరి వికెట్‌కు ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం కావడం విశేషం. దీంతో పాటు ఈ లీగ్‌లో అరంగేట్రం చేసిన పిన్న వయుస్కుడిగా ముజీబ్ ఉర్ రెహ్మాన్ నిలిచాడు. ప్రస్తుతం ముజీబ్ ఉర్ రెహ్మాన్ వయసు 17 ఏళ్లు. ఈ మ్యాచ్‌లో మాజీ టెస్టు క్రికెటర్ పీటర్ సిడ్డిల్ వేసిన తొలి బంతిని ముజీబ్ రివర్స్ స్వీప్ ఆడిన షాట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

అరంగేట్ర మ్యాచ్‌లోనే అరుదైన రికార్డు

అరంగేట్ర మ్యాచ్‌లోనే అరుదైన రికార్డు

తన తొలి మ్యాచ్‌లోనే అనుభవం ఉన్న ఆటగాడి మాదిరి ముజీబ్ రెచ్చిపోయాడు. బిల్లీ స్టాన్‌లేక్ బౌలింగ్‌లో విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 27 పరుగులు చేసిన ముజీబ్... బ్రిస్బేన్ హీట్ కెప్టెన్ క్రిస్ లిన్(33) తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

5 వికెట్ల తేడాతో బ్రిస్బేన్ హీట్ విజయం

5 వికెట్ల తేడాతో బ్రిస్బేన్ హీట్ విజయం

అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు 146 పరుగులు చేసింది. అనంతరం 147 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బేన్ హీట్ మరో ఐదు బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించింది. ముజీబ్ బ్యాటింగ్‌పై జట్టులోని సహచర ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

సీనియర్ బౌలర్లు అని తేడా లేకుండా

సీనియర్ బౌలర్లు అని తేడా లేకుండా

"ముజీబ్ బ్యాటింగ్ బాగా ఆడతాడని తెలియదు, అయితే అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆడాడు. సీనియర్ బౌలర్లు అని తేడా లేకుండా విజృంభించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు" అని బ్రెండన్ మెక్‌కల్లమ్ తెలిపాడు. ఆప్ఘనిస్థాన్‌ జట్టు తరుపున ఇప్పటివరకు 23 వన్డేలు, 7 టీ20లు ఆడాడు.

 ఐపీఎల్‌లో పంజాబ్ తరుపున

ఐపీఎల్‌లో పంజాబ్ తరుపున

బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్ల తరుపున టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేయడంతో ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను కొనుగోలు చేసేందుకు పలు ప్రాంఛైజీలు ఆసక్తి కనబర్చాయి. గత ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరుపున ఆడిన ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ 11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఆ ప్రదర్శనే అతడిని బిగ్ బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ కొనుగోలు చేసేలా చేసింది.

Story first published: Friday, December 21, 2018, 15:24 [IST]
Other articles published on Dec 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X