న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆదిత్య సర్వాతే: వరుసగా రెండో ఏడాది విదర్భ టైటిల్ నెగ్గడానికి కారకుడు!

Aditya Sarwate: The Spin Bowling Wizard Who Led Vidarbha To Their 2nd Ranji Trophy Title

హైదరాబాద్: ఆదిత్య సర్వాతే... రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడు. సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్లో మొత్తం 11 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారాను పెవిలియన్‌కు చేర్చడంలో సఫలీకృతమయ్యాడు. ఇటీవలే ఆస్ట్రేలియా గడ్డపై మూడు సెంచరీలు సాధించి భారత క్రికెట్ జట్టు చారిత్రక టెస్టు విజయానికి కారణమైన ఛటేశ్వర్ పుజారా దేశవాళీలో క్రికెట్‌కు ఎంతో కీలక రంజీ ఫైనల్లో తడబడ్డాడు.

India vs New Zealand: రెండో టీ20 ప్రివ్యూ: ఎప్పుడు, ఎక్కడ ఎలా వీక్షించాలి!India vs New Zealand: రెండో టీ20 ప్రివ్యూ: ఎప్పుడు, ఎక్కడ ఎలా వీక్షించాలి!

పుజారాపై సౌరాష్ట్ర జట్టు ఎన్నో ఆశలు

పుజారాపై సౌరాష్ట్ర జట్టు ఎన్నో ఆశలు

ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని 521 పరుగులతో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పుజారాపై సౌరాష్ట్ర జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే, విదర్భతో జరిగిన ఫైనల్లో పుజారా దారణంగా విఫలమయ్యాడు. రంజీ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి జట్టు ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.

సెమీస్‌లో అంపైర్ తప్పిదం కారణంగా

సెమీస్‌లో అంపైర్ తప్పిదం కారణంగా

కర్ణాటకతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సెమీస్‌లో అంపైర్ తప్పిదం కారణంగా రెండుసార్లు బతికిపోయిన పుజారా 45, 131 నాటౌట్ చొప్పున పరుగులు సౌరాష్ట్రను ఫైనల్‌కు చేర్చాడు. దీంతో రంజీ ట్రోఫై ఫైనల్లో పుజారాని త్వరగా పెవిలియన్ కు చేర్చేందుకు గాను విదర్భ జట్టు ప్రత్యేక వ్యూహాలు రూపొందించింది.

పక్కా ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేసిన ఆదిత్య

పక్కా ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేసిన ఆదిత్య

పక్కా ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేసిన ఆదిత్య సర్వాతే.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పుజారాను పెవిలియన్ చేర్చాడు. కీలక సమయంలో పుజారా పెవిలియన్‌కు చేరడంతో విజయం విదర్భ సొంతమైంది. అంతేకాదు విదర్భ జట్టు వరుసగా రెండోసారి రంజీ విజేతగా నిలిచింది. పుజారాను ఎదుర్కోవడం కోసం విదర్భ కోచ్ చంద్రకాంత్ పండిట్ ప్రత్యేకంగా వ్యూహాలు రూపొందించాడు.

స్లిప్, సిల్లీ పాయింట్లలో ఫీల్డర్లను

స్లిప్, సిల్లీ పాయింట్లలో ఫీల్డర్లను

ఇందులో భాగంగా స్లిప్, సిల్లీ పాయింట్లలో ఫీల్డర్లను మోహరించి పుజారాపై ఒత్తిడి పెంచారు. పుజారా క్రీజ్‌లోకి రాగానే షార్ట్ లెగ్ ఇన్‌లో ఫీల్డర్‌ను మోహరించారు. పుజారా క్రీజులోకి రాగానే అతడు వీక్‌గా ఉన్న ఏరియాలో ఫీల్డర్లను ఉంచడం ద్వారా ఒత్తిడి పెంచామని... అతడు క్రీజ్‌లోనే ఉండి బంతిని ఎదుర్కొనేలా సరైన ప్రాంతంలో బంతులు విసిరి ఫలితం రాబట్టామని మ్యాచ్ అనంతరం విదర్భ బౌలర్ ఆదిత్య సర్వాతే వెల్లడించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు

రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు

ఈ మ్యాచ్‌లో ఆదిత్య సర్వాటె మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు తీసి సౌరాష్ట పతనాన్నిశాసించాడు. నాలుగో రోజు సౌరాష్ట్ర టాపార్డర్‌ను దెబ్బ తీసిన ఆదిత్య.. చివరి రోజైన గురువారం మరో మూడు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసిన ఆదిత్య సర్వాతే... రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. అతనికి తోడుగా అక్షయ్‌ వాఖరే మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్‌ యాదవ్‌ వికెట్‌ తీశాడు.

Story first published: Thursday, February 7, 2019, 18:00 [IST]
Other articles published on Feb 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X