న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఎండార్స్‌మెంట్లు రావడం లేదని బాధ లేదు, భారత్‌ తరఫున ఆడటమే గొప్ప'

Adda with Pujara: ‘Not bothered about endorsements, like appreciation more’

హైదరాబాద్: ఎండార్స్‌మెంట్ల ద్వారా సంపాదించడం కంటే కూడా భారత్‌ తరఫున ఆడటమే గొప్పగా భావిస్తానని టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పుజారా వ్యాఖ్యానించాడు. భారత జట్టులోని పలువురు స్టార్ ప్లేయర్లకు బీసీసీఐ ఇచ్చే వార్షిక వేతనం కంటే ఎండార్స్‌మెంట్లతో సంపాదించే మొత్తమే ఎక్కువ కావడం విశేషం.

Successful run-chases: కోహ్లీ, ధోనిల రికార్డుని దాటేసిన రాయుడుSuccessful run-chases: కోహ్లీ, ధోనిల రికార్డుని దాటేసిన రాయుడు

అయితే ఈ విషయం గురించి తాను ఏనాడు చింతించలేదని, దేశం కోసం ఆడటం మాత్రమే తనకు ముఖ్యమని పుజారా పేర్కొన్నాడు. బుధవారం ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్యూలో పుజారా మాట్లాడుతూ "ఎక్కువ ప్రకటనల్లో కనిపించే పుజారా కంటే టెస్టు స్పెషలిస్టు పుజారా అనే మాటే నాకు ఇష్టం" అని అన్నాడు.

ఎండార్స్‌మెంట్‌ ఆఫర్లు రావు

ఎండార్స్‌మెంట్‌ ఆఫర్లు రావు

"టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కారణంగా పెద్దగా ఎండార్స్‌మెంట్‌ ఆఫర్లు రావన్న విషయాన్ని అంగీకరించక తప్పదు. క్రికెట్‌ ఆడటాన్ని ఆస్వాదించడం మాత్రమే నాకు తెలుసు. యాడ్‌ ఏజెన్సీలు నా వద్దకు వచ్చినప్పుడల్లా మా నాన్న నాకు చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. స్వప్రయోజనాల గురించి ఆలోచించకుండా దేశం కోసం మాత్రమే ఆడాలని మా నాన్న చెప్పారు" అని పుజారా తెలిపాడు.

దేశం కోసం క్రికెట్ ఆడుతున్నా

దేశం కోసం క్రికెట్ ఆడుతున్నా

"నేను నా వరకే క్రికెట్‌ ఆడటం లేదు. నేను నాదేశం కోసం ఆడుతున్నాను. జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడానికి ఎంత కష్ట పడ్డానో నాకే తెలుసు. ఎండార్స్‌మెంట్ల ద్వారా సంపాదించడం కంటే కూడా భారత్‌ తరఫున ఆడటమే గొప్పగా భావిస్తాను. నేను మ్యాచ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనుకుంటున్నాను" అని పుజారా చెప్పుకొచ్చాడు.

521 పరుగులు చేసిన పుజారా

521 పరుగులు చేసిన పుజారా

ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుని చారిత్రక విజయం సొంతం చేసుకోవడంలో పుజారా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో మొత్తం మూడు సెంచరీలతో ఆకట్టుకున్న పుజారా 521 పరుగులు చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డునూ కూడా గెలుచుకున్నాడు.

Story first published: Thursday, January 24, 2019, 11:28 [IST]
Other articles published on Jan 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X