న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పాండ్యా లేని లోటు టీమిండియాపై ప్రభావం చూపే అవకాశం'

India vs Australia 2018-2019 : Hardik Pandya's Absence Will Impact India..? | Oneindia Telugu
Absence of Hardik Pandya will hurt India: Michael Hussey

హైదరాబాద్: గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆసియాకప్‌లో వెన్నెముక గాయానికి గురైన హార్దిక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు హార్దిక్ పాండ్యాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

ఫోటోలు: ఆసీస్ పర్యటనకు ముందు ఎయిర్ పోర్ట్‌లో ఓ అభిమానితో కోహ్లీఫోటోలు: ఆసీస్ పర్యటనకు ముందు ఎయిర్ పోర్ట్‌లో ఓ అభిమానితో కోహ్లీ

ఈ నేపథ్యంలో వచ్చే టెస్టు సిరీస్‌కు అతను జట్టులో లేకపోవడం టీమిండియాపై ప్రభావం చూపే అవకాశముందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్‌ హస్సీ అన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ విజయావకాశాలపై హాస్సీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ "హార్దిక్‌లో గొప్ప నైపుణ్యం ఉంది. ఆస్ట్రేలియాలోని పరిస్థితులకు అతని ఆటతీరు అతికినట్టుగా సరిపోయేది" అని అన్నాడు.

ఆల్‌రౌండ్‌ లక్షణాలతో జట్టుకు సమతూకం తెస్తాడు

ఆల్‌రౌండ్‌ లక్షణాలతో జట్టుకు సమతూకం తెస్తాడు

"అతని ఆల్‌రౌండ్‌ లక్షణాలతో జట్టుకు సమతూకం తెస్తాడు. కానీ గాయం కారణంగా అతను ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరమవడం భారత జట్టుపై ప్రభావం చూపే వీలుంది" అని హస్సీ తెలిపాడు. వచ్చే సిరీస్‌లో భారతే ఫేవరేట్‌గా బరిలో దిగుతుందని అయినా కూడా ఆస్ట్రేలియా బౌలింగ్‌ను తక్కువ అంచనా వేయకూడదని హస్సీ అన్నాడు.

 టెస్ట్ సిరీస్ గెలిచేందుకు భారత్‌కు మంచి అవకాశం

టెస్ట్ సిరీస్ గెలిచేందుకు భారత్‌కు మంచి అవకాశం

"స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్‌స్మిత్, వార్నర్ లేకుండా టెస్ట్ సిరీస్ గెలిచేందుకు భారత్‌కు మంచి అవకాశముంది. కానీ స్టార్క్, హాజిల్‌వుడ్, ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్‌తో కూడిన ఆసీస్ బౌలింగ్ బృందాన్ని తొలిసారి ఎదుర్కొవడం టీమిండియాకు యువ బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు. స్వదేశంలో ఆస్ట్రేలియా ఎప్పుడూ ఉత్తమ ఆటతీరే కనబరుస్తుంది.ఆ జట్టును ఓడించడం అంత సులభం కాదు" అని అన్నాడు.

కోహ్లిని అడ్డుకోవాలంటే ఓపికతో ఎదురుచూడాలి

కోహ్లిని అడ్డుకోవాలంటే ఓపికతో ఎదురుచూడాలి

"భారత జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నా, ముఖ్యంగా ఆసీస్‌లో ఇప్పటివరకు ఆడని పృథ్వీషా, హనుమ విహారి, రిషబ్ పంత్‌కు కష్టం కావచ్చు. గత పర్యటనలో నాలుగు సెంచరీలతో విజృంభించిన విరాట్ కోహ్లీ ఆసీస్‌కు పెద్ద ముప్పు. కోహ్లిని కట్టడి చేసేందుకు బౌలర్లు సిద్ధమై ఉండాలి. ప్రపంచ ఉత్తమ ఆటగాడు కోహ్లిని అడ్డుకోవాలంటే ఓపికతో ఎదురుచూడాలి" అని హస్సీ అన్నాడు.

ఇంగ్లాండ్‌లో బాగానే ఆడినా టీమిండియా ఓడిపోయింది

ఇంగ్లాండ్‌లో బాగానే ఆడినా టీమిండియా ఓడిపోయింది

"ఇంగ్లాండ్‌లో బాగానే ఆడినా టీమిండియా ఓడిపోయింది. కానీ ఆస్ట్రేలియాతో ఆ సిరీస్‌ను ముడిపెట్టి చూడలేం. ఇక్కడ పరిస్థితులు వేరు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపింది. దాని నుంచి బయటపడ్డ అందరూ ఇప్పుడు ఆటపై దృష్టిపెడుతున్నారు, భారత బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ ఆసీస్ బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు సాధిస్తూ జట్టులో చోటు నిలుపుకోవాలి" అని హస్సీ అన్నాడు.

Story first published: Saturday, November 17, 2018, 9:17 [IST]
Other articles published on Nov 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X