న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన అభిమన్యు మిథున్: ఓవర్‌లో 5 వికెట్లు, అందులో హ్యాట్రిక్

 Abhimanyu Mithun takes five wickets in an over, including hat-trick against Haryana in Syed Mushtaq Ali Trophy

హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ అరుదైన రికార్డుని సాధించాడు. ఈ టీ20 టోర్నీలో భాగంగా శుక్రవారం హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం.

లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఈ దశలో ఆఖరి ఓవర్ వేసిన అభిమన్యు మిథున్ ఆ ఓవర్‌లో ఐదు వికెట్లు తీయడంతో హర్యానా ఎనిమిది పరుగులకు 194 పరుగులు చేయగలిగింది.

డే నైట్ టెస్టులో సెహ్వాగ్ రికార్డు సమం: ఆసీస్ ఓపెనర్లు సెంచరీలు, డే1-302/1డే నైట్ టెస్టులో సెహ్వాగ్ రికార్డు సమం: ఆసీస్ ఓపెనర్లు సెంచరీలు, డే1-302/1



ఫలితంగా రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీల్లో హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్‌గా మిథున్ చరిత్ర సృష్టించాడు. ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి హిమన్షు రాణా(34 బంతుల్లో 61) వికెట్‌ తీసిన మిథున్ రెండో బంతికి రాహుల్ తెవాటియా(32) వికెట్ పడగొట్టాడు.

మూడో బంతికి సుమీత్ కుమార్ ఇచ్చిన క్యాచ్‌ని డీప్ మిడ్ వికెట్ రోహన్ కదామ్‌ అందుకున్నాడు. ఫలితంగా అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. నాలుగో బంతికి వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను ఔట్ చేయడం ద్వారా తన ఖాతాలో నాలుగో వికెట్ వేసుకున్నాడు.

ఐదో బంతిని వైడ్‌గా సంధించిన మిథున్ ఆ తర్వాతి బంతికి ఒక పరుగిచ్చాడు. ఇక, ఆఖరి బంతికి జయంత్ యాదవ్‌ను ఔట్ చేశాడు. దీంతో ఒక ఓవర్‌లో ఒక పరుగిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

Story first published: Friday, November 29, 2019, 18:39 [IST]
Other articles published on Nov 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X