న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాలెంట్‌ ఉంటే సరిపోదు.. హార్దిక్‌ ఇంకా మంచి ఆల్‌రౌండర్‌ కాలేదు: రజాక్‌

Abdul Razzaq says Hardik Pandya is a good player but he can be a much better all-rounder
Hardik Pandya Needs To Work Harder Says Abdul Razzaq | Oneindia Telugu

కరాచీ: టీమిండియా ఆటగాడు హార్దిక్‌ పాండ్యాను అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతానంటూ గతంలో ప్రకటించిన పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌.. మరొకసారి హార్దిక్‌ను టార్గెట్‌ చేశాడు. ఇప్పటికీ హార్దిక్‌ పాండ్యా పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌ కాలేదన్నాడు. పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే మరింత కష్టపడాల్సిందేనని రజాక్‌ అభిప్రాయపడ్డాడు. అతడిని దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌తో పోల్చడం ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశాడు.

ఉదయం రెండింటికి లేచి.. 6 గంట‌ల ప్ర‌యాణం చేసి స్టేడియానికి చేరుకునేవాడిని: పంత్ఉదయం రెండింటికి లేచి.. 6 గంట‌ల ప్ర‌యాణం చేసి స్టేడియానికి చేరుకునేవాడిని: పంత్

హార్దిక్‌ ఇంకా మంచి ఆల్‌రౌండర్‌ కాలేదు:

హార్దిక్‌ ఇంకా మంచి ఆల్‌రౌండర్‌ కాలేదు:

తాజాగా పీటీఐకు ఇచ్చిన ఇంటర్యూలో అబ్దుల్‌ రజాక్‌ మాట్లాడుతూ...'హార్దిక్‌ పాండ్యా ఒక మంచి క్రికెటర్‌. కానీ ఇంకా పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌ కాలేదు. హార్దిక్‌ మెరుగైన ఆల్‌రౌండర్‌ కావాలాంటే మరింత కష్టపడాలి. గేమ్‌కు సాధ్యమైనంత సమయం కేటాయించకపోతే.. అది నిన్ను వదిలేస్తుంది. హార్దిక్‌ శారీరకంగా, మానసికంగా గేమ్‌పై దృష్టి పెట్టాలి. రిలాక్స్‌ అయితే అది చాలా ప్రమాదం. కొంతమంది డబ్బు ఎక్కువైతే చేసే పని మీద ఫోకస్‌ చేయరు. దాంతో మళ్లీ మొదటకొస్తారు' అని అన్నాడు.

కపిల్‌తో పాండ్యాకు పోలికా:

కపిల్‌తో పాండ్యాకు పోలికా:

హార్దిక్‌ పాండ్యా గురించి అబ్దుల్‌ రజాక్‌ మాట్లాడుతూ.. తమ దేశ క్రికెటర్‌ మహ్మద్‌ అమిర్‌ను ఉదహరించాడు. క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అమిర్‌ రిలాక్స్‌ అయిపోవడం వల్లే అతని కెరీర్‌ గాడి తప్పిందన్నాడు. ఇదే విషయం ఎవరికైనా వర్తిస్తుందని హార్దిక్‌ను పరోక్షంగా హెచ్చరించాడు. 'కపిల్ దేవ్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ అత్యుత్తమ ఆల్‌రౌండర్లు. వారి స్థానం ప్రత్యేకం. ఆ జాబితాలో చేరేందుకు హార్దిక్‌ కనుచూపు మేరలో కూడా లేడు. నేను కూడా ఆల్‌రౌండర్‌నే. అలాగని ఇమ్రాన్‌తో పోల్చుకోలేను కదా' అని రజాక్‌ చెప్పుకొచ్చాడు.

బుమ్రాపై వ్యక్తిగతంగా ద్వేషం లేదు:

బుమ్రాపై వ్యక్తిగతంగా ద్వేషం లేదు:

భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా‌ని బచ్చా బౌలర్‌గా అభివర్ణించిన అబ్దుల్ రజాక్.. తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 'బుమ్రాపై వ్యక్తిగతంగా నాకేమీ ద్వేషం లేదు. నేను కేవలం మెక్‌గ్రాత్, వసీమ్ అక్రమ్, ఆంబ్రోస్, షోయబ్ అక్తర్‌లతో పోల్చి బచ్చా బౌలర్ అని అన్నా. బుమ్రాతో పోలిస్తే.. వారి బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టమని చెప్పడం నా ఉద్దేశం. కానీ నా వ్యాఖ్యల్ని కొంత మంది వక్రీకరించారు' అని రజాక్ వెల్లడించాడు.

 వెన్నుగాయంతో టీమిండియాకు దూరం:

వెన్నుగాయంతో టీమిండియాకు దూరం:

గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌ పాండ్యా .. శస్త్ర చికిత్స తర్వాత న్యూజిలాండ్‌ 'ఎ' పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, చివరి నిమిషంలో హార్దిక్‌ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. పాండ్యా కోసం బీసీసీఐ కొన్ని రోజులు జట్టు ఎంపికను కూడా వాయిదా వేసింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. అది కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా జరగలేదు. కాగా హార్దిక్‌ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే క్రమంలో రెచ్చిపోయి ఆడాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్‌ టీ20 కప్‌లో రిలయన్స్‌-1 తరఫున ఆడిన హార్దిక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

Story first published: Saturday, May 2, 2020, 15:06 [IST]
Other articles published on May 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X