న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆటకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి: డివిలియర్స్‌పై ప్రశంసల వర్షం

By Nageshwara Rao
AB de Villiers: South Africa batsman retires from international cricket

హైదరాబాద్: తన అద్భుతమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. డివిలియర్స్ నిర్ణయంపై క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.

డివిలియర్స్ రిటైర్‌మెంట్‌పై ఐసీసీ, బీసీసీఐ సహా పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డివిలియర్స్ రిటైర్‌మెంట్‌పై క్రికెట్ దక్షిణాఫ్రికా స్పందించింది. డివిలియర్స్ రిటైర్‌మెంట్‌పై క్రికెట్ దక్షిణాప్రికా అధ్యక్షుడు క్రిస్ నెన్‌జాని మాట్లాడారు.

దిగ్గజ క్రికెటర్లలో ఒకడు

దిగ్గజ క్రికెటర్లలో ఒకడు

'డివిలియర్స్ తన అద్భుత ప్రదర్శనతో అభిమానుల్ని అమితంగా అలరించిన దిగ్గజ క్రికెటర్లలో ఒకడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లో ముఖ్యంగా వైట్ బాల్ ఫార్మాట్‌లోని ఆటకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి. ఇంటర్‌నేషనల్‌, డొమెస్టిక్ క్రికెట్‌లో అతని సహచర క్రికెటర్లతో పాటు యువ క్రికెటర్లకు అతను ఆదర్శం' అని అన్నారు.

డివిలియర్స్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనపడుతుంది

'దక్షిణాఫ్రికా ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన జట్టులో అతని లోటు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఇంతకాలంగా దక్షిణాఫ్రికా క్రికెట్‌కి అతను అందించిన సేవలకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో అతనికి, అతని కుటుంబానికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు. క్రికెట్ సౌతాఫ్రికా తాత్కాలిక సీఈఓ థబాంగ్ మోరే కూడా ఏబీకి అభినందనలు తెలిపాడు.

మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన డివిలియర్స్

34 ఏళ్ల ఏబీ డివిలియర్స్ మూడు ఫార్మాట్ల నుంచి తాను వైదొలగుతున్నట్లు బుధవారం తన ట్విట్టర్‌‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు. అందులో 'తక్షణమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నా. 114 టెస్టు మ్యాచ్‌లు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాను. ఇతరులకు అవకాశం ఇచ్చే సమయం ఇది. ప్రస్తుతం నా వంతు వచ్చింది. నేను అలసిపోయానని నిజాయతీగా చెబుతున్నాను. నేను రిటైర్ అవుతున్నా' అని తెలిపాడు.

 2004లో అరంగేట్రం చేసిన డివిలియర్స్

2004లో అరంగేట్రం చేసిన డివిలియర్స్

2004 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు, 141 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ మొత్తం 50 సెంచరీలు, 137 హాఫ్ సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో డివిలియర్స్‌కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతుల్లో), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతుల్లో), ఫాస్టెస్ట్ 150 (64 బంతుల్లో) రికార్డులు డివిలియర్స్ పేరిటే ఉన్నాయి.

టెస్ట్ ర్యాంకుల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాడు

టెస్ట్ ర్యాంకుల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాడు

దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక టెస్టు స్కోరు (278 నాటౌట్) కూడా డివిలియర్స్ పేరిటే ఉంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అత్యధిక పాయింట్లు (935) సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ కూడా డివిలియర్సే కావడం విశేషం. మొత్తం 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు ఉన్నాయి. ఇక, 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు చేశాడు.

Story first published: Wednesday, May 23, 2018, 21:17 [IST]
Other articles published on May 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X