న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిత్తుగా ఓడిన పాక్: 3-0తో సిరిస్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా

Aaron Finch, Adam Zampa Star As Australia Ease To Series Win Over Pakistan

హైదరాబాద్: అబుదాబి వేదికగా ఆతిథ్య పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను మరో రెండు వన్డేలు మిగిలుండగానే ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఈ వన్డే సిరిస్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోవడంలో ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలకపాత్ర పోషించాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

భారత్‌తో ఇటీవలే ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌లో పేలవ ప్రదర్శన చేసిన ఆరోన్ ఫించ్... పాకిస్థాన్‌తో జరుగుతున్న ఈ సిరిస్‌తో సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలు బాదిన ఫించ్‌.. మూడో వన్డేలో 90 పరుగుల వద్ద ఔటయ్యాడు. మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.

ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా డకౌట్‌గా పెవిలియన్ చేరినప్పటికీ... ఆరోన్ ఫించ్ 136 బంతుల్లో 90 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫించ్‌కు తోడు ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో మ్యాక్స్‌వెల్‌(71), పీటర్‌ హ్యాండ్స్‌ కోంబ్‌(47)లు ఫరవాలేదనిపంచారు. పాక్ బౌలర్లలో ఉస్మాన్ ఖాన్, జునైద్ ఖాన్, యాసిర్ షా, ఇమాద్ వాసిమ్, సోహైల్ తలో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 267 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 44.4 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. పాక్‌ బ్యాట్స్‌మెన్లలో ఇమాముల్‌ హక్‌(46), ఇమాద్‌ వసీమ్‌(43), ఉమర్‌ అక‍్మల్‌(36), షోయబ్‌ మాలిక్‌(32)లు మినహా ఎవరూ రాణించలేదు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా నాలుగు, కమిన్స్‌ మూడు వికెట్లు తీయగా... బెహ్రాన్‌డార్ఫ్‌, నాథన్‌ లయాన్‌, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్‌ తీశారు.

Story first published: Thursday, March 28, 2019, 17:28 [IST]
Other articles published on Mar 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X