కోహ్లీ ఆహ్వానం: ఉప్పల్ స్టేడియానికి 'సీక్రెట్ సూపర్‌స్టార్'

Posted By:

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో టీ20 మరికొన్ని గంటల్లో నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరగబోతోంది. ఈ మ్యాచ్‌కి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆహ్వానం మేరకు 'సీక్రెట్ సూపర్‌స్టార్' హాజరుకాబోతున్నాడు. 'సీక్రెట్ సూపర్‌స్టార్' ఎవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్.

హైదరాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న మూడో టీ20కి హాజరవ్వాలని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆమీర్ ఖాన్‌ను స్వయంగా ఆహ్వానించారు. దీపావళి పండుగ నేపథ్యంలో కోహ్లీ, ఆమీర్‌ ఖాన్ అక్టోబర్‌ 2న ఓ టీవీ చాట్‌ షో షూటింగ్‌లో పాల్గొన్నారు.

 మూడో టీ20కి రావాలని ఆమీర్ ఖాన్‌ని ఆహ్వానించిన కోహ్లీ

మూడో టీ20కి రావాలని ఆమీర్ ఖాన్‌ని ఆహ్వానించిన కోహ్లీ

ఈ సందర్భంలో విరాట్ కోహ్లీ టీమిండియా జెర్సీని అమీర్ ఖాన్‌కు ఇచ్చి మూడో టీ20కి రావాలని ఆహ్వానించారట. కోహ్లీ కోరిక మేరకు ఆమీర్ ఖాన్ హైదరాబాద్ వచ్చారని, ఇరు జట్లకు చెందిన క్రికెటర్లు బస చేసిన హోటల్లోనే బస చేశారని, టీమిండియా క్రికెటర్లను కలిసనట్లు తెలుస్తోంది.

భారత్‌లో 19వ వేదిక ఉప్పల్‌ స్టేడియం

భారత్‌లో 19వ వేదిక ఉప్పల్‌ స్టేడియం

కోహ్లీ ఇచ్చిన జెర్సీ ధరించి మరి కొన్ని గంటల్లో ప్రారంభమయ్యే మూడో టీ20కి అమీర్ ఖాన్ హాజరయ్యే అవకాశం ఉంది. భారత్‌లో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న 19వ వేదిక ఉప్పల్‌ స్టేడియం నిలిచింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది.

హైదరాబాద్‌లో శుక్రవారం భారీ వర్షం పడే అవకాశం

హైదరాబాద్‌లో శుక్రవారం భారీ వర్షం పడే అవకాశం

గత పది రోజులుగా హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న వర్షాలు శుక్రవారం మ్యాచ్‌ను సాగనిస్తాడా? అన్న అనుమానం కూడా ఉంది. హైదరాబాద్‌లో శుక్రవారం భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ కూడా పేర్కొంది. గురువారం రాత్రి భారీ వర్షానికి స్టేడియం తడిసి ముద్దయింది.

 టేబుల్‌ ఫ్యాన్లతో పిచ్‌ను ఆరబెడుతున్న మైదాన సిబ్బంది

టేబుల్‌ ఫ్యాన్లతో పిచ్‌ను ఆరబెడుతున్న మైదాన సిబ్బంది

గురువారం కూడా వర్షం రావడంతో ఉప్పల్‌ మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. వర్షం తగ్గగానే సిబ్బంది కవర్లు తొలగిస్తున్నారు. తేమ ఎక్కువగా ప్రదేశాల్లో సిబ్బంది టేబుల్‌ ఫ్యాన్లతో పిచ్‌ను ఆరబెడుతున్నారు. రాంచీలో జరిగిన తొలి టీ20కి వర్షం ఆటంకం కల్పించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌కు 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. మరీ హైదరాబాద్‌ టీ20లో ఏం జరుగుతుందో చూడాలి.

Story first published: Friday, October 13, 2017, 17:01 [IST]
Other articles published on Oct 13, 2017
Please Wait while comments are loading...
POLLS