న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కసాయి వాడి చెంతకు గొర్రెపిల్లను పంపినట్లు ఏంటా చెత్త కెప్టెన్సీ కేన్? కాస్త బుర్ర పెట్టు

Aakash Chopra Trolls Kane Williamson For His Poor Captaincy Skills On Sunrisers Hyderabad Team

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. తొలుత రెండు గేమ్‌లలో ఓటములను చవిచూసిన ఆ జట్టు.. వరుసగా 5 విజయాలను నమోదు చేసి వావ్ అనిపించింది. మళ్లీ వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయి తుస్సుమనిపించింది. వరుసగా ఓటములు ఆ జట్టు ప్లేఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేయడంతో పాటు పాయింట్ల పట్టికలో ఆ జట్టు స్థానం దిగజార్చాయి. ఇక సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అత్యంత అధ్వాన బ్యాటింగ్ ఆ జట్టు ఓటములకు ఓ ప్రధాన కారణమని చెప్పొచ్చు.

ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న కేన్ మామ ఈ సీజన్‌లో కేవలం 208పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 20లోపే ఉంది. ఇక స్ట్రైక్ రేట్ కూడా అత్యంత దారుణంగా 100కంటే తక్కువగా ఉంది. అతని గణాంకాలే చెబుతాయి అతను ఎంత పూర్‌గా ఆడుతున్నాడో. ఇక విలియమ్సన్ కెప్టెన్సీలో కూడా ఏమాత్రం ప్రభావం చూపడం లేదని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

చెత్త డిసిషన్ తీసుకున్న విలియమ్సన్

చెత్త డిసిషన్ తీసుకున్న విలియమ్సన్

కేకేఆర్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ ఓ చెత్త డిసిషన్ తీసుకున్నాడు. ఆఖరి ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ చేత బౌలింగ్ చేయించాడు. ఇక ఆ ఓవర్లో ఆండ్రీ రస్సెల్ క్రీజులో ఉండి సిక్సర్లతో బదులిచ్చాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఇక ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తొలిసారి తలపడినప్పుడు కూడా కెప్టెన్ విలియమ్సన్ ఆఖరి ఓవర్లో జగదీశ్ సుచిత్ చేత బౌలింగ్ చేయించాడు.

అప్పుడు కూడా రసెల్ వీరవిహారం చేశాడు. ఇలా ఓసారి దెబ్బతిన్నా బుద్ధి లేకుండా విచిత్రమైన వ్యూహం అమలుపరుస్తున్న కేన్ చర్యలకు ఆకాష్ చోప్రా అయోమయానికి గురవుతున్నట్లు పేర్కొన్నాడు.

నాకైతే కేన్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు

నాకైతే కేన్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు

విలియమ్సన్ వ్యూహాన్ని ప్రశ్నించిన ఆకాష్ చోప్రా మాట్లాడుతూ..'నాకసలు అర్థం కాదు. కేన్ ఒక కెప్టెన్, అతను ఇది వరకే లాస్ట్ ఓవర్ స్పిన్నర్‌తో వేయించి దెబ్బతిన్నాడు. అది ఇంకా పరిశీలించకుండా మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నాడు. బ్రబౌర్న్ స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో జగదీశ సుచిత్ చేత చివరి ఓవర్ బౌలింగ్ చేయించి మూల్యం చెల్లించాడు.

ఇప్పుడేమో వాషింగ్టన్ సుందర్‌ను బలిపశువు చేశాడు. అసలు రసెల్ లాంటి హిట్టర్ ఉన్నప్పుడు కేన్ విలియమ్సన్‌కు ఎలా స్పిన్నర్‌కు బౌలింగ్ ఇవ్వబుద్ధైందో నాకైతే అర్థం కావడం లేదు' అని చోప్రా పేర్కొన్నాడు.

 రసెల్ బ్యాటింగ్ చేస్తే స్పిన్నర్లను పంపిస్తారా?

రసెల్ బ్యాటింగ్ చేస్తే స్పిన్నర్లను పంపిస్తారా?

'కేన్ విలియమ్సన్ నిస్సందేహంగా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. కానీ ఇప్పుడు అతని మైండ్ రెండుసార్లు పనివ్వలేదు. అది కూడా ఆండ్రీ రస్సెల్‌కి వ్యతిరేకంగా అతను చెత్త ప్రయోగం చేశాడు. అతను ఎలా వ్యవహరించడంటే గొర్రెపిల్లను కసాయి వాడి చెంతకు పంపించినట్లు స్పిన్నర్లను లాస్ట్ ఓవర్లో రసెల్‌ను ఎదుర్కోవడానికి పంపించాడు. రసెల్ బ్యాటింగ్ చేస్తుండగా స్పిన్నర్లను పంపిస్తే ఏం జరుగుతుంది.

కసాయివాడు గొర్రెపిల్లను కోసినట్లు.. రసెల్ స్పిన్నర్ల బౌలింగ్‌ను చీల్చిచెండాడుతాడు.' అని పేర్కొన్నాడు. ఇకపోతే ప్లేఆఫ్‌లలో అర్హత సాధించడానికి సన్ రైజర్స్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాల్సిన అవసరముంది. అయినా సన్ రైజర్స్ ప్లేఆఫ్ చేరడానికి మిగతా జట్ల జయాపజయాలు కూడా కీలకమవుతాయి.

Story first published: Monday, May 16, 2022, 14:39 [IST]
Other articles published on May 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X