న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aakash Chopra : శుభ్‌మాన్ గిల్ ఓపెనర్‌గా వంద శాతం కరెక్ట్ కాదు.. అతను ఆ ఆర్డర్లో వస్తే తన బెస్ట్ ఇస్తాడు

Aakash Chopra : Shubman Gill Best Suited for No.3 or no.4 in Batting Lineup Than Opener

టెస్ట్‌లలో నంబర్ 3 లేదా నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ చేయడానికి శుభ్‌మాన్ గిల్ సరిగ్గా సరిపోతాడని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అతను విదేశాల్లోనే కాకుండా స్వదేశంలో జరిగే టెస్ట్‌లలో కూడా స్వింగ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నాడు. గిల్ తన టెస్ట్ కెరీర్‌లో ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. ఇక జులై 1న ఇంగ్లాండ్‌తో జరగబోయే రీషెడ్యూల్డ్ టెస్ట్‌లో అతను మళ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. గత ఏడాది భారత్ ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు.. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ బ్యాటింగ్ ప్రారంభించారు.

ఇప్పుడు కేఎల్ రాహుల్ గజ్జలో గాయం కారణంగా ఇండియా టెస్ట్ జట్టు నుంచి వైదొలిగాడు. అలాగే రాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో రోహిత్ శర్మకు పాజిటివ్ రావడంతో అతను జట్టులో ఉంటాడో ఉండడో ఇంకా తెలియట్లేదు. ఇక గిల్ ఒక్కడే ప్రస్తుతం రెగ్యులర్ ఓపెనర్‌గా అందుబాటులో ఉన్నాడు.

ఓపెనర్‌గా ఉత్తమ ఎంపిక కాదు

ఓపెనర్‌గా ఉత్తమ ఎంపిక కాదు

ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. 'రీషెడ్యూల్ చేసిన టెస్ట్‌కి ఇప్పుడు శుభ్‌మాన్ గిల్ ఓపెనర్‌లలో కచ్చితంగా ఒకడు అవుతాడు. కానీ అతను ఆ స్థానానికి ఉత్తమ ఎంపిక కాదని నేను హండ్రెడ్ పర్సంట్ భావిస్తున్నాను. అతను నంబర్ 3 లేదా నంబర్ 4లో బరిలోకి దిగితే అతని నుంచి బెస్ట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఓపెనర్లు స్వింగ్ బంతులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బంతి స్వింగ్ అవుతున్న టైంలో అతను బ్యాటింగ్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోవడాన్ని మనం చూశాం.' అన్నాడు.

పుంజుకోవడానికి మరో అవకాశం ఉండదు

పుంజుకోవడానికి మరో అవకాశం ఉండదు

'శుభ్ మాన్ గిల్ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఒకే ఒక్క టెస్టు ఆడబోతున్నాడు. మీరు ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడుతున్నప్పుడు ప్రారంభంలో విఫలమైనా తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అతనికి ఆ అవకాశం లేదు' అని చోప్రా పేర్కొన్నాడు. ఇక మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. రోహిత్‌కు కవర్ ప్లేయర్‌గా అతన్ని బీసీసీఐ సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2021ప్రారంభంలో శుభ్ మాన్ గిల్‌ రాణించడంతో టెస్ట్‌ల్లో తన స్థానాన్ని మయాంక్ కోల్పోయాడు.

విదేశాల్లో మయాంక్‌కు పెద్దగా అవకాశాలు రాలే

విదేశాల్లో మయాంక్‌కు పెద్దగా అవకాశాలు రాలే

మయాంక్ అగర్వాల్ స్వదేశంలో తిరుగులేని బ్యాటర్ అయినప్పటికీ, విదేశీ పర్యటనలలో అతనికి పెద్దగా అవకాశాలు లభించడం లేదని ఆకాష్ చోప్రా చెప్పాడు. 'టీమిండియాలో మయాంక్‌ అగర్వాల్‌ ఒక తిరుగులేని శక్తి. అతను స్వదేశంలో చాలా పరుగులు చేయగలడు.

అందుకే అతను విదేశీ పర్యటనల కోసం జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాడు. కానీ విదేశాల్లో అతనికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. అతను దక్షిణాఫ్రికా సిరీస్లో బాగా రాణించలేదు. అందుకే ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో పూర్తిస్థాయి ప్లేయర్‌గా అతను ఎంపికకాలేదు. రోహిత్ గైర్హాజరీ అయితే ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌ను మనం చూడొచ్చు' అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Story first published: Tuesday, June 28, 2022, 11:37 [IST]
Other articles published on Jun 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X