న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aakash Chopra: పుజారాలా పంత్.. కోహ్లీలా రహానే ఆడలేడు.. దూకుడుగా ఆడటమే సరైన వైఖరి కాదు..

Aakash Chopra says What you get from Pujara, you will not get from Pant over Virat Kohli comments
Commentator Akash Chopra backs Chatheswar Pujara and Ajinkya Rahane | Oneindia Telugu

న్యూఢిల్లీ: దూకుడుగా ఆడితేనే సరైన ఇంటెంట్ ఉన్నట్లు కాదని టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. భారత జట్టులో రిషభ్ పంత్, చతేశ్వర్ పుజారా భిన్నమైన ఆటగాళ్లని, ఒకరు దూకుడుగా ఆడితే.. మరొకరు డిఫెన్స్ చేస్తారన్నాడు. కానీ ఈ ఇద్దరు జట్టు‌కు అవసరమేనన్నాడు. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. కొందరు ఆటగాళ్లు పరుగులు చేసేందుకు అవసరమైన తీవ్రతను ప్రదర్శించలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. భిన్నమైన పరిస్థితుల్లో సరైన వైఖరితో ఆడగలిగే ఆటగాళ్లను ఎంపిక చేస్తామని, పరిమిత ఓవర్ల మాదిరి బెస్ట్ టీమ్‌ను సిద్దం చేస్తామన్నాడు.

 పుజారా, రహానే రాణిస్తారు..

పుజారా, రహానే రాణిస్తారు..

దాంతో రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన చతేశ్వర్ పుజారాను జట్టులో నుంచి తీసేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా ముందు అభిమానులు ఇదే విషయాన్ని ప్రస్తావించగా కోహ్లీ చేసిన వ్యాఖ్యలు పుజారాను ఉద్దేశించి చేసినవి కాదన్నాడు.'అప్‌కమింగ్ ఇంగ్లండ్‌ సిరీస్‌లో చతేశ్వర్ పుజారా, రహానే అద్భుతంగా రాణిస్తారు. ఈ విషయంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు. ఇక జట్టులో ప్రతి ఒక్కరి ఒక్కో స్టైల్ ఉంది. పుజారాలా పంత్, రహానేలా కోహ్లీ ఆడలేడనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎవరి శైలి వారిదే. దాన్ని మనం గౌరవించాల్సిందే.

 కోహ్లీ ఉద్దేశం అది కాదు..

కోహ్లీ ఉద్దేశం అది కాదు..

నాకు తెలిసి కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఆటగాళ్లను ఉద్దేశించినవి అయితే కావు. ముఖ్యంగా రహానే, పుజారా స్లో బ్యాటింగ్ గురించి కూడా కావు. డ్రెస్సింగ్ రూమ్ ఆలోచన విధానం గురించి అయ్యుంటుంది. ఆటగాళ్ల పాజిటివ్ థింకింగ్ గురించి అయ్యుండొచ్చు. పుజారా, రహానే గురించి కోహ్లీ మాట్లాడాడని నేను అనుకోవడం లేదు. అసలు ఇంటెంట్ అంటే ఏంటి? కొలిన్ డీ గ్రాండ్ హోమ్ ఆడినట్లా? లేక సెకండ్ ఇన్నింగ్స్‌లో పంత్ ఆడినట్లా?

ఇంటెంట్ అంటే..?

ఇంటెంట్ అంటే..?

రోహిత్ శర్మ తన శైలికి భిన్నంగా జట్టు అవసరాల మేరకు నెమ్మదిగా ఆడటం పాజిటివ్ ఇంటెంట్. రిషభ్ పంత్ దూకుడుగా ఆడినప్పటికీ అది జట్టుకు పనికొచ్చేది కాదు. కాబట్టి అతనిది సరైన ఇంటెంట్ కాదు. ఇంటెంట్ అంటే సిడ్నీ టెస్ట్‌లో బౌలర్లకు అడ్డుగోడలా నిల్చొని బంతులను తగిలించుకున్న పుజారాది. అదే టెస్ట్‌లో ప్రతికూలతల మధ్య డ్రా కోసం పోరాడిన అశ్విన్, విహారిలది ఇంటెంట్. 'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, June 28, 2021, 15:47 [IST]
Other articles published on Jun 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X