న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aakash Chopra : చాహల్ ఒక్కడే ఆ విషయంలో పనికొస్తాడు.. అక్షర్, అశ్విన్‌తో ఆ పని కాదు

Aakash Chopra Says that Only Chahal is Wicket taking spin Option in T20 World cup Squad

ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ - 2022 కోసం భారత 15మంది సభ్యుల జట్టులో యుజ్వేంద్ర చాహల్ మాత్రమే వికెట్ టేకింగ్ స్పిన్ ఎంపిక అని మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐసీసీ టోర్నమెంట్ కోసం భారత్ తమ 15మంది సభ్యుల జట్టులో ముగ్గురు స్పిన్నర్లు చాహల్, ఆర్.అశ్విన్, అక్షర్ పటేల్‌లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన ఆసియా‌కప్ టోర్నీలో చాహల్ అంతగా ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చలేదు. చాహల్ తనదైన ప్రభావాన్ని చూపించలేకపోయాడు. 7.93ఎకానమీ రేటు బౌలింగ్ వేశాడు. ఇక అన్ని మ్యాచ్‌ల్లో కలిపి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

నేను పొరపాటుగా ఏం చెప్పట్లేదు

నేను పొరపాటుగా ఏం చెప్పట్లేదు

ఇటీవల అశ్విన్, అక్షర్ పటేల్‌ల బౌలింగ్ రికార్డులను గనుక చూసుకుంటే వాళ్లు కేవలం డిఫెన్సివ్ ఆప్షన్‌లు మాత్రమేనని చోప్రా అన్నాడు. ‘సెలెక్షన్ కమిటీ ముగ్గురు స్పిన్నర్లను ఎంచుకుంది. ఆఫ్‌స్పిన్నర్, లెగ్‌స్పిన్నర్, లెఫ్టార్మ్ స్పిన్నర్. స్పిన్ ఆప్షన్లలో భిన్నమైన ఎంపికలను ఎంచుకోవడం మంచిదే. అయితే ఇందులో యుజీ చాహల్ మాత్రమే వికెట్ టేకింగ్ ఆప్షన్. అతను మాత్రమే అవసరానికి వికెట్లు తీయగలడు' అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. ‘మిగిలిన ఇద్దరు అక్షర్ పటేల్, అశ్విన్ కేవలం ఢిఫెన్సివ్ స్పిన్నర్లు మాత్రమే. నేను పొరపాటుగా ఏం చెప్పట్లేదు. ఇదే నిజం. మీరు గత 12నెలల గణాంకాలను కూడా చూసుకోండి. ఐపీఎల్‌లో కూడా అక్షర్, రవిచంద్రన్ అశ్విన్ ప్రదర్శనలను గమనించండి' అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

రవి బిష్ణోయ్ లేదా కుల్దీప్‌ను ఎందుకు పట్టించుకోలే

రవి బిష్ణోయ్ లేదా కుల్దీప్‌ను ఎందుకు పట్టించుకోలే

భారత సెలెక్టర్లు రవి బిష్ణోయ్ లేదా కుల్దీప్ యాదవ్‌ను టీ20ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేసి ఉండాల్సిందని చోప్రా సూచించాడు. ‘రవి బిష్ణోయ్ మీకు మంచి వికెట్ టేకింగ్ ఆప్షన్. అసలు కుల్దీప్ యాదవ్ గురించి సెలెక్షన్ కమిటీ అస్సలు ఆలోచించడమే లేదు. ఈ తరహా ప్రవర్తన కాస్త నిరుత్సాహపరిచింది. కుల్దీప్ యాదవ్ కూడా వికెట్ టేకింగ్ ఆప్షన్ అని నేను చెబుతా. స్పిన్ విభాగంలో వీరిద్దరి గురించి కమిటీ పరిగణనలోకి తీసుకోకపోవడం సరైంది కాదు. ఇక జట్టు ప్లేయింగ్ 11లో ముగ్గురు స్పిన్నర్లలో ఇద్దరిని ఆడించగలిగే వీలుంటుంది. యూజీ చాహల్‌తో కలిసి అక్షర్ లేదా రవి అశ్విన్‌ను ఆడించొచ్చు' అని చోప్రా జోడించారు.

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు:

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ , యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.

స్టాండ్‌బై ప్లేయర్‌లు - మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.

Story first published: Wednesday, September 14, 2022, 10:10 [IST]
Other articles published on Sep 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X