న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!

Aakash Chopra predicts Mitchell Starc to become the most expensive IPL buy ever
IPL 2021 Auction : Aakash Chopra Predicts Mitchell Starc To Be The Most Expensive IPL Player Ever

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజ‌న్ కోసం ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీల‌న్నీ వాళ్ల రిటెన్ష‌న్ ప్లేయ‌ర్స్‌, వ‌దిలేసిన ప్లేయ‌ర్స్ జాబితాను బుధవారం ప్ర‌క‌టించాయి. కొన్ని టీమ్స్ పెద్ద పెద్ద ప్లేయ‌ర్స్‌ను వ‌దిలేసి ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తమ సారథి స్టీవ్ స్మిత్‌ను వదిలేసింది.

ఇక ఆరోన్ ఫించ్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, క్రిస్ మోరిస్, బిల్లీ స్టాన్‌లేక్‌, మోయిన్ అలీ, ఇసురు ఉడానా, డేల్ స్టెయిన్‌, ఉమేష్ యాదవ్, షెల్డ‌న్ కాట్రెల్‌, జిమ్మీ నీష‌మ్‌, క్రిస్ గ్రీన్‌, టామ్ బాంట‌న్, కేదార్ జాద‌వ్‌‌ ‌లాంటి ప్లేయ‌ర్స్‌ను కూడా ఆయా ఫ్రాంచైజీలు రిలీజ్ చేశాయి. దీంతో వీరందరూ వేలంలో తమ దృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

అత్యధిక ధర అతడికే

ఐపీఎల్ 14వ సీజ‌న్ కోసం వేలం జరగనున్న నేపథ్యంలోనే భారత మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా స్పందిస్తూ ట్విటర్‌లో పలువురు ఆటగాళ్ల ధరలను అంచనా వేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికే విదేశీ ఆటగాడిగా ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ నిలుస్తాడని జోస్యం చెప్పాడు. అయితే అతడెంత ధర పలుకుతాడనే విషయాన్ని మాత్రం చెప్పని చోప్రా.. ఎవరూ ఊహించని ధరకు అమ్ముడుపోతాడన్నాడు. టీ20 ప్రపంచకప్‌ ఉందని స్టార్క్‌ గతేడాది ఐపీఎల్ ఆడలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు గహంలో ఆడాడు. 2014లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడి ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.

మాక్స్‌వెల్‌కు మంచి ధరేనట

మాక్స్‌వెల్‌కు మంచి ధరేనట

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ వదిలేసిన ముజీబుర్‌ రెహ్మాన్‌ ఈసారి వేలంలో రూ.7-8 కోట్ల మధ్య ధర పలుకుతాడని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కోల్‌కతా నైట్ రైడ‌ర్స్‌ ఆటగాడు క్రిస్ ‌గ్రీన్‌ ధర రూ.5-6 కోట్లు ఉండొచ్చని అంచనా వేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ వదిలేసిన జేసన్‌ రాయ్‌ రూ.4-6 కోట్ల మధ్య ధర పలుకుతాడన్నాడు. ఐపీఎల్ 2020‌లో మంచి ప్రదర్శన చేయకపోవడంతో పంజాబ్‌, ముంబై వదిలేసిన మాక్స్‌వెల్‌, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ ఇప్పటికీ మంచి ధర పలుకుతారని జోస్యం చెప్పాడు. అయితే ఇవన్నీ తన ఊహాగానాలేనని, ఆయా ఆటగాళ్ల ఆసక్తిపైనే ఆయా ధరలు ఆధారపడతాయన్నాడు.

చెన్నైతోనే రైనా

చెన్నైతోనే రైనా

ఐపీఎల్ 2020లో ఆడని చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు సురేశ్‌ రైనాను అట్టిపెట్టుకుంది. యూఏఈలో జరిగిన గత సీజన్‌లో ఆడటం కోసం రైనా అక్కడిదాకా వెళ్లి.. వ్యక్తిగత కారణాలతో తిరుగుపయనమయ్యాడు. ఇది చెన్నై బ్యాటింగ్‌ ఆర్డర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. జట్టు కూర్పు ఏమాత్రం కుదరలేదు. దీంతో సీఎస్‌కే లీగ్‌ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన ప్రదర్శనతో నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో రైనాకు చెన్నై ఫ్రాంచైజీ మంగళం పాడటం ఖాయమనే వార్తలొచ్చాయి. అప్పట్లో ఫ్రాంచైజీ యజమాని‌ శ్రీనివాసన్‌ కూడా సూచనప్రాయంగా ఇదే చెప్పారు. కానీ ఇప్పుడు రైనాను అట్టిపెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

హైదరాబాద్‌ చేరుకున్న సిరాజ్.. టోలిచౌక్‌లో కోలాహలం! సాయత్రం మీడియాతో సమావేశం!

Story first published: Thursday, January 21, 2021, 13:28 [IST]
Other articles published on Jan 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X