న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యూఏఈలో ఆర్‌సీబీ మెరుగైన ప్రదర్శన చేస్తుంది.. కారణం చెప్పిన ఆకాశ్‌ చోప్రా!!

Aakash Chopra explains why Royal Challengers Bangalore might find success if IPL happens in UAE

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ యూఏఈలో రాణించే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్‌, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అంచనా వేశారు. లీగ్‌ను యూఏఈకి తరలించడంలో ఇబ్బందేమీ ఉండదన్నారు. అక్కడి వేడి వాతావరణాన్ని తట్టుకోవడమే ఆటగాళ్లకు సవాలని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.

 ఇబ్బందేమీ ఉండదు:

ఇబ్బందేమీ ఉండదు:

తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌ ఆకాశ్‌వాణిలో మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2020ని యూఏఈకి తరలించడంలో ఇబ్బందేమీ ఉండదు. అయితే ఆటగాళ్లు మాత్రం అక్కడి వేడిని తట్టుకోవాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే.. యూఏఈలో ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం వాతావరణం బాగుంది. సెప్టెంబర్‌, అక్టోబర్ నెలలోను ఆహ్లాదకరంగానే ఉంటుంది. కానీ సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 7 వరకు ఐపీఎల్ జరిగితే.. ఐదు వారాల్లోనే టోర్నీ ముగించాలంటే ఎక్కువ డబుల్‌ హెడర్స్‌ (రెండు మ్యాచులు) నిర్వహించక తప్పదు. అప్పడు సాయంత్రం మ్యాచులు మొదలైతే ఆటగాళ్లు త్వరగా డీహైడ్రేట్‌ అవుతారు' అని క్రికెట్ వ్యాఖ్యాత తెలిపారు.

లోపాలు బయట పడకపోవచ్చు:

లోపాలు బయట పడకపోవచ్చు:

'బ్యాటింగ్‌ పరంగా యూఏఈలో ప్రభావమేమీ ఉండదని నా అంచనా. అయితే కొన్ని జట్లు అక్కడ మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఆస్కారం ఉంది. మైదానాలు పెద్దవి కావడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి జట్ల బౌలింగ్ లోపాలు బయట పడకపోవచ్చు. అలాంటప్పుడు పటిష్ఠ బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న కోహ్లీసేన మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది. అలానే నాణ్యమైన స్పిన్నర్లు ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కూ అక్కడి మైదానాలు సరిపోతాయి. ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. వేడి వాతావరణమే పెద్ద సమస్య' అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్‌ పేర్కొన్నారు.

 ధోనీ రీఎంట్రీ ఉంటుంది:

ధోనీ రీఎంట్రీ ఉంటుంది:

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే అవకాశాలున్నాయని మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డారు. ధోనీ మళ్లీ ఆడాలనుకుంటే అది తన ఇష్టమని, అతడే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అలాగే భారత జట్టు కూడా అతడిని కావాలనుకుంటే ఐపీఎల్‌ పెర్ఫామెన్స్‌తో సంబధం లేకుండా తీసుకుంటుందన్నారు. ఏడాది కాలంగా మహీ క్రికెట్‌ ఆడలేనందున అతడి ఫామ్‌ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదని చోప్రా స్పష్టం చేశారు.

 యూఏఈలో ఐపీఎల్‌:

యూఏఈలో ఐపీఎల్‌:

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం వాయిదా వేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేయడంతో.. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు మార్గం సుగమమైంది. ఇక యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. భారత ప్రభుత్వ అనుమతి రాగానే.. లీగ్ షెడ్యూల్‌తో సహా అన్ని విషయాలపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని లీగ్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ తెలిపారు.

IPL 2020: సెప్టెంబర్‌ 26 కాదు.. అంతకుముందే ఐపీఎల్‌ ఆరంభం!!

Story first published: Wednesday, July 22, 2020, 17:04 [IST]
Other articles published on Jul 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X