న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aakash Chopra : మంచి స్పిన్నరా కాదా అనేది పాయింట్ కాదు.. ఎలాంటి స్పిన్నర్ కావాలనేది ఇంపార్టెంట్

Aakash Chopra About Ravichandran Ashwin Role in Asia Cup

భారత ఆసియా కప్ జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కకపోవడం పట్ల పలువురు విమర్శకులు జట్టు సెలెక్షన్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం నెట్టింటా కూడా ఆ మధ్య కాస్త ట్రెండింగ్ అయింది. అలాగే రవిచంద్రన్ అశ్విన్‌‌‌ను తీసుకుని ఇన్-ఫామ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్‌ను తప్పించడం కూడా కాస్త విమర్శలకు లోనైన విషయం. ఈ విషయంపై ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఆసియా కప్‌కు భారత్‌కు ఎలాంటి స్పిన్నర్ అవసరమో దాన్ని బట్టే అశ్విన్ సెలెక్షన్ జరిగిందన్నాడు.

అశ్విన్ గత ప్రపంచ‌కప్‌లో కూడా అకస్మాత్తుగా ఎంపికయ్యాడు. ఇప్పుడు కూడా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లి ఇప్పుడు ఆసియా కప్ జట్టులో చోటు సంపాదించాడు. అతను మళ్లీ వరల్డ్ కప్ ఆడతాడు. ఇక్కడ కుల్దీప్ మంచి స్పిన్నరా.. అశ్విన్ మంచి స్పిన్నరా అనేది ఇంపార్టెంట్ కాదు. మీకు ఎలాంటి స్పిన్నర్ కావాలి అనేది పాయింట్' అని ఆకాష్ చోప్రా అన్నాడు.

Aakash Chopra About Ravichandran Ashwin Role in Asia Cup

'అతను వెస్టిండీస్ టూర్లో ఐదు మ్యాచ్‌లు ఆడాడు. ఆరు వికెట్లు తీశాడు. అతని సగటు 20. ఎకానమీ 6.1. అతను చాలా బాగా ప్రదర్శన కనబర్చుతున్నాడు. అతను ఆడిన ఐదు మ్యాచ్‌లలో తన సత్తా ఏంటో చూపెట్టాడు.' అని ఆకాష్ చోప్రా తెలిపాడు. అశ్విన్ నుంచి వికెట్లు ఆశించడం కంటే డిఫెన్సివ్ లేదా ఎకానమీ బౌలింగ్ ఆశిస్తే బాగుంటుంది. మిడిల్ ఓవర్లలో అశ్విన్ దాన్ని చేయగలడని సెలెక్షన్ కమిటీ భావించినట్టుంది అని ఆకాష్ చోప్రా తెలిపాడు.

ఇక ఆసియా కప్ జట్టు సెలెక్షన్ విషయంలో నలుగురు స్పిన్నర్లను తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. రవీంద్రజడేజా, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్ ఆసియా కప్ టీంకు సెలెక్ట్ అయ్యారు. అయితే రవీంద్ర జడేజా స్థానం ఫిక్స్ కాగా.. మరో స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ ఫిక్స్.. ఇక అశ్విన్, బిష్ణోయ్ మూడో స్పిన్నర్ ఆప్షన్ అందువల్ల ఎవరూ తుది జట్టులో ఉంటారనేది క్రిటికల్ విషయం. ఏదేమైనా రవి బిష్ణోయ్ కంటే అశ్విన్‌కు ఎక్కువ అవకాశాలుంటాయి.

Story first published: Sunday, August 14, 2022, 19:24 [IST]
Other articles published on Aug 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X