లాక్‌డౌన్ జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకునేలా చేసింది: అనుష్క

ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో క్రీడలు, సినిమా, వ్యాపారం ఇలా ఎన్నో రంగాలు స్తంభించిపోయాయి. కరోనా పంజా విసురుతుండడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో సామాన్యులతో పాటు సెలెబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయితే ఈ సమయాన్ని ఈ జంట ఆస్వాదిస్తున్నారు.

ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం:
అయితే అనుష్క శర్మ ఇంట్లో ఉంటూ.. కరోనాతో ప్రజల్లో నెలకొన్న భయాలను దూరం చేసి, ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేసింది. బుధవారం కోహ్లీ, పెంపుడు కుక్కతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. లాక్‌డౌన్ సందర్భంగా ఎన్నో సానుకూల విషయాలను నేర్చుకుంటున్నట్టు అనుష్క రాసుకొచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ ఇంటివద్దే జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

జీవితంలో ఏది ముఖ్యమో తెలిసింది:
'కారుమబ్బులోనూ ఓ మెరుపు దాగి ఉంటుంది. ప్రస్తుతం నెలకొన్న ఈ కఠిన పరిస్థితులు మనల్ని ఆగిపోయేలా చేశాయి. తీరిక లేకుండా ఉన్నామని చెప్పుకునే పనులు చేయకుండా ఆపేశాయి. అయితే ఈ సమయాన్ని గౌరవిస్తే.. అది మనకు మరింత వెలుగుల్ని ఇస్తుంది. ఈ సమయం జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకునేలా చేసింది. ఆహారం, నీళ్లు, ఇల్లు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం.. ఇవే నాకిప్పుడు ప్రధానమైనవి. మిగతావన్ని అదనంగా లభించినందుకు కృతజ్ఞతలు' అని అనుష్క శర్మ పేర్కొంది.

వాళ్ల కోసం నేను ప్రార్థిస్తున్నా:
'మనం కనీస అవసరాలు అనుకునేవి బయట చాలా మందికి దొరకడం లేదు. వాళ్ల కోసం నేను ప్రార్థిస్తున్నా. అందరికి అన్ని దొరకాలని కోరుకుంటున్నా. కుటుంబంతో కలిసి ఉండండి అంటూ ప్రస్తుత పరిస్థితులు ప్రపంచాన్ని శాసించాయి. దాంట్లో ఓ పాఠం దాగి ఉంది. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమన్వయం ఎంత అవసరమో అది తెలుపుతోంది' అని తను రాసిన పోస్టుకు అనుష్క జత చేసింది.

హెయిర్‌స్టైలిస్ట్‌గా:
దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా బయట నిత్యావసర దుకాణాలు మినహా మిగతావన్నీ మూసివేయడంతో విరాట్‌కు హెయిర్‌స్టైలిస్ట్ ఎవరూ దొరకలేదు. దీంతో విరాట్ హెయిర్ కట్ బాధ్యతని అనుష్క తీసుకుంది. ఓ కత్తెర పట్టుకుని కోహ్లీ హెయిర్ స్టైల్ సెట్ చేసింది. నా భార్య చేసిన అందమైన హెయిర్‌కట్ అని కోహ్లీ సంబరపడిపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications