న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ వేవ్‌లో కొట్టుకుపోయింది గానీ- టీ20 ప్రపంచకప్‌లో అతి పెద్ద తప్పు..!!

 A fan breaches guards to enter the field, tries to meet India pacer Bhuvneshwar Kumar at MCG

మెల్‌బోర్న్: రసవత్తరంగా సాగిపోతోన్న టీ20 ప్రపంచకప్ 2022లో అతిపెద్ద కుదుపు చోటు చేసుకుంది. పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న వేళ అనూహ్య ఘటన సంభవించింది. ఈ పరిణామం- ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ భద్రత లోపాన్ని ఎత్తిచూపినట్టయింది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను నిర్వహించడంలో క్రికెట్ ఆస్ట్రేలియా విఫలమైందనే వాదనలు వినిపిస్తోన్నాయి.

టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పిచ్‌పై విరాట్ కోహ్లీ వీర విహారం చేశాడు. 31 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుకు ఒంటిచేత్తో గెలుపుబాట పట్టించాడు. 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్తాన్‌పై టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు కింగ్ కోహ్లీ.

అంతకుముందే- మెల్‌బోర్న్ స్టేడియం భద్రతలో ఉన్న డొల్లతనం బయటపడింది. టీమిండియా ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని నేరుగా గ్రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను కలుసుకున్నాడు. ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ బలవంత పెట్టాడు. భద్రత వ్యవస్థను దాటుకుని గ్రౌండ్‌పై అడుగు పెట్టాడా అభిమాని. ఫలితంగా కొద్దిసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ప్లేయర్లందరూ స్తబ్దుగా ఉండిపోయారు.

బుల్లెట్‌కైనా ఎదురెళ్తా - విరాట్ కోహ్లీ కాపాడుకుంటా: హార్దిక్ పాండ్యా గ్రేట్ కామెంట్స్..!!బుల్లెట్‌కైనా ఎదురెళ్తా - విరాట్ కోహ్లీ కాపాడుకుంటా: హార్దిక్ పాండ్యా గ్రేట్ కామెంట్స్..!!

ఒక అభిమాని పిచ్‌పైకి దూసుకుని రావడం ఇది తొలిసారి కాదు గానీ.. ఆస్ట్రేలియాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, పైగా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇది జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలాంటి ఉదంతాలు సాధారణంగా ఆసియన్ దేశాల్లో జరుగుతుంటాయి. అభిమానులు తమ ఆరాధ్య దైవాలను కలుసుకోవడానికి గ్రౌండ్‌లోకి దూసుకువచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాము ఆరాధించి క్రికెటర్లను కలుసుకోవడానికి అంతకంటే మంచి సమయం దొరకదనేది ఫ్యాన్స్ భావన.

పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ రాణించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి, ఒక వికెట్ పడగొట్టాడీ పేసర్. ఎనిమిది బంతుల్లో ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 16 పరుగులు చేసి, దూకుడు మీదున్న షహీన్ షా అఫ్రిదిని పెవిలియన్ దారి పట్టించాడు. కాట్ అండ్ బౌల్డ్‌గా వెనక్కి పంపాడు. అది ఇన్నింగ్ ఎనిమిదో వికెట్. ఆ తరువాత పాకిస్తాన్ పెద్దగా పరుగులేవీ చేయలేకపోయింది. 159 పరుగులతో సరిపెట్టుకుంది.

Story first published: Monday, October 24, 2022, 15:51 [IST]
Other articles published on Oct 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X