న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కపిల్‌దేవ్‌ బయోపిక్.. శ్రీకాంత్ పాత్రలో 'జీవా' ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ ఇదే!!

83 Character Posters: First Look of Jiiva as Kris Srikkanth

చెన్నై: టీమిండియా లెజెండరీ క్రికెటర్‌, మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. '83' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌కు కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్‌ను ఎలా సాధించింది అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కపిల్‌ దేవ్‌ పాత్రలో బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. మరో లెజండరీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు తహీర్‌ రాజ్‌ భాసిన్‌ నటిస్తున్నాడు.

తొలి వన్డే.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్‌-ధావన్‌!!తొలి వన్డే.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్‌-ధావన్‌!!

క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్‌ పాటిల్‌, బల్వీందర్‌ సింగ్‌ పాత్రలో అమ్మీ విర్క్, సయ్యద్‌ కిర్మాణి పాత్రలో సాహిల్‌ ఖట్టర్‌ నటిస్తున్నారు. ఇక కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నాడు. రణ్‌వీర్‌ శనివారం 83 పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. సునీల్‌ గావస్కర్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. అందులో తాహిర్‌ రాజ్‌ భాసిన్‌ గావస్కర్‌ పాత్రలో కనిపిస్తున్నారు.

రణ్‌వీర్‌ ఆదివారం ఇంకో పోస్టర్‌ను విడుదల చేయగా.. అందులో జీవాను పరిచయం చేశారు. శ్రీకాంత్‌ పాత్రలో జీవా అద్భుతంగా కనిపిస్తున్నాడు. పాడ్స్, హెల్మెట్, బ్యాట్ పట్టుకుని స్టైలిష్ లుక్‌లో అదరగొట్టాడు. శ్రీకాంత్‌ పాత్రలో నటించడం గురించి జీవా మాట్లాడుతూ... 'క్రికెట్‌ అంటే చిన్న వయసు నుంచే ఇష్టం. అలాంటిది 83 చిత్రంలో కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం ఆనందంగా ఉంది. జీవితంలో రెండు లక్ష్యాలు ఒకేసారి నెరవేరుతున్నట్లు భావన కలిగింది' అని అన్నాడు.

'నటుడు అయిన తరువాత ఇష్టమైన రంగం క్రికెటే. క్రికెట్‌ క్రీడ విధి విధానాలను తమిళనాడులో పరిచయం చేసింది కృష్ణమాచారి శ్రీకాంతే. అలాంటి పాత్రలో నటించడం నాకు వరం లాంటిది. ఈ పాత్రకు తనను ఎంపిక చేసిన దర్శకుడు కబీర్‌ ఖాన్‌కు కృతజ్ఞతలు' అని జీవా చెప్పుకొచ్చాడు. 'శ్రీకాంత్‌ గురించి ఆలోచించగా ఆయన చలాకీతనం, వేగం, బ్యాటింగ్‌లో తనదైన స్టైల్‌ ప్రధానాంశాలు అనిపించాయి. ఆ పాత్రలో చలాకీగా ఉండే నటుడి కోసం అన్వేషించగా.. జీవా బాగా నప్పుతారని భావించాం. జీవాలోనూ మంచి క్రికెట్‌ క్రీడాకారుడు ఉండటంతో 83 చిత్రానికి మరింత బలం చేకూరింది. శ్రీకాంత్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను అనుచరించడం కోసం జీవా శిక్షణ తీసుకున్నాడు. ఆ పాత్రలో జీవా కచ్చితంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాడు' అని కబీర్‌ఖాన్‌ పేర్కొన్నాడు.

Story first published: Monday, January 13, 2020, 16:28 [IST]
Other articles published on Jan 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X