న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్‌కు హాజరైన 8 అడుగుల అఫ్గాన్ ఫ్యాన్.. సెల్ఫీ కోసం ఎగబడిన అభిమానులు!!

Afghanistan Fan : 8 Feet Tall Afghanistan Fan Attends Afghantan vs West Indies 1st ODI || Oneindia
8-feet tall Afghanistan cricket fan Sher Khan attends Afghanistan vs West Indies 1st ODI


లక్నో: గత మూడు నాలుగు రోజులుగా ఆప్ఘనిస్థాన్ నుంచి వచ్చిన 8 అడుగుల షేర్‌ఖాన్‌ అనే క్రికెట్ అభిమాని ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తమ దేశ క్రికెట్ ఆటపై ఉన్న పిచ్చి అభిమానంతో.. ఆప్ఘనిస్థాన్-వెస్టిండిస్ జట్ల మధ్య లక్నో‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌ కోసం షేర్‌ఖాన్‌ మంగళవారం అక్కడకు చేరుకున్నాడు.

'స్టంపింగ్‌ మా దురదృష్టం.. పంత్‌పై ఎలాంటి కోపం లేదు''స్టంపింగ్‌ మా దురదృష్టం.. పంత్‌పై ఎలాంటి కోపం లేదు'

బుధవారం ఆప్ఘనిస్థాన్-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేకు షేర్‌ఖాన్‌ హాజరయ్యాడు. మైదానంలో ఈ పొడగరి అభిమానులతో సందడి చేసాడు. షేర్‌ఖాన్‌ 8 ఫీట్ల 2 ఇంచుల పొడవున్నాడు కాబట్టి మైదానాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులు అతనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. షేర్‌ఖాన్‌ మాత్రం ఎలాంటి అసహసనానికి గురికాకుండా అందరికి సెల్ఫీలు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సెల్ఫీల ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ఆప్ఘనిస్థాన్ జట్టుపై ఉన్న అభిమానంతో కాబుల్ నుంచి లక్నోకు చేరుకున్న షేర్‌ఖాన్‌ ఎత్తుకు సరిపడ హోటల్ గదులు లక్నోలో లేకపోవడంతో మంగళవారం అతడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో అతనికిక్ లక్నోలో చేదు అనుభవం ఎదురైంది. గదులు దొరక్కపోవడంతో చేసేదేమీ లేక షేర్ ఖాన్ నాకా పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన సమస్యను పోలీసులకు వివరించాడు. షేర్‌ఖాన్‌కు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను పరిశీలించిన పోలీసులు.. అతను బస చేయడానికి ఓ ప్రదేశాన్ని చూపించారు. ఇంకా రెండు మూడు రోజులు షేర్‌ఖాన్‌ అక్కడే ఉండనున్నాడట.

మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో విండీస్ 7 వికెట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్ఘాన్‌ 45.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా (61), ఇక్రమ్‌ అలికిల్‌ (58) అర్ధ సెంచరీలు చేశారు. విండీస్ బౌలర్లలో జాసన్‌ హోల్డర్‌, చేజ్‌, రొమారియో షెపర్డ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్‌ 46.5 ఓవర్లలో 3 వికెట్లకు 195 రన్స్‌ చేసి విజయం సాధించింది. రోస్టన్‌ చేజ్‌ (94), షాయ్‌ హోప్‌ (77 నాటౌట్‌) మూడో వికెట్‌కు 163 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు. స్పిన్నర్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ (2/33) రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

భారత్‌ను సొంతగడ్డగా చేసుకుని అఫ్ఘాన్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగనుంది. వన్డే సిరిస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ జరగనుంది. అనంతరం ఏకైక టెస్టు కూడా జరగనుంది. అన్ని మ్యాచ్‌లు అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలోనే జరగనున్నాయి.

Story first published: Friday, November 8, 2019, 14:53 [IST]
Other articles published on Nov 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X