న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2019లో రికార్డుల కోసం ఎదురుచూస్తోన్న భారత క్రికెటర్లు

7 milestones Indian cricketers can achieve in 2019

హైదరాబాద్: ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో 2019లో వన్డే సిరీస్ ఆడనుంది టీమిండియా. నవంబరు 21నుంచి మొదలవుతున్నా.. వన్డే సిరీస్‌కు కాస్తంత సమయం దొరికింది. ఈ టీ20, వన్డే షార్మాట్‌ల మధ్యలో భారత్ టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో సంవత్సారారంభం చేసుకుంటోన్న టీమిండియా క్రికెట్ చరిత్రలో ఏడాది ప్రత్యేకంగా నిలిచిపోనుంది.

టీమిండియా ఈ పర్యటన ముగించుకుని ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌కు చేరుకోనుంది. ప్రత్యేకమైన మ్యాచ్‌లలో ఆడేందుకు సిద్ధమవుతోన్న టీమిండియా ఆటగాళ్ల కెరీర్‌లో చేరేందుకు ఏడు మైలురాళ్లు ఎదురుచూస్తున్నాయి. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ అయిన ఢిల్లీ ఆటగాడు ధావన్.. ఐదేళ్లుగా పరిమిత ఓవర్లలో భారత్‌కు ఓపెనర్‌గానే బరిలోకి దిగుతున్నాడు. ధావన్.. రోహిత్‌తో కలిసి ఎన్నో రికార్డులు సృష్టించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు సార్లు (2013, 2017)లలో గోల్డెన్ బ్యాట్‌ను అందుకున్నాడు ధావన్. 2019 ప్రపంచ కప్ ప్లేయర్లలో ఒకానొక కీ ప్లేయర్‌గా నిలిచాడు.

వన్డే క్రికెట్‌లో 5వేల పరుగులకు

వన్డే క్రికెట్‌లో 5వేల పరుగులకు

అతని వన్డే కెరీర్‌లో 5000పరుగులు చేరుకోవడానికి 65 పరుగుల దూరం మాత్రమే ఉంది. ఈ క్రమంలో చాలా తక్కువ ఇన్నింగ్స్‌లో 5వేల పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌లో రెండో ఆటగాడిగా నిలవనున్నాడు. విరాట్ కోహ్లీ 114ఇన్నింగ్స్‌లలోనే 5వేల పూర్తి చేయగా.. ఇప్పటివరకూ 13 మంది భారతీయులు 5000పరుగుల జాబితాలో ఉన్నారు. హషీమ్ ఆమ్లా ఇన్ని పరుగులు సాధించడానికి కేవలం 101 ఇన్నింగ్స్ సమయం మాత్రమే తీసుకున్నాడు.

పది వేల క్లబ్ చేరేందుకు ధోనీ ఎదురుచూపులు:

పది వేల క్లబ్ చేరేందుకు ధోనీ ఎదురుచూపులు:

ఫామ్‌లో లేడంటూ పలు విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పదివేల క్లబ్‌లో చేరేందుకు ఎదురుచూపులు చూస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితిల్లో అంతగా రాణించలేకపోతున్న ధోనీ.. స్టంప్‌ల వెనుక కీపింగ్‌లో ఏ మాత్రం వేగం తగ్గించలేదు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కేవలం పది వేల పరుగులకు ఒక్కపరుగు దూరంలో నిలిచిన ధోనీ 2019లో ఆ ఒక్కటి చేరుకుని పదివేలు దాటనున్నాడు. ఇలా పదివేలు పరుగులు చేయనున్న భారత క్రికెటర్లలో ధోనీ ఐదో వాడిగా నిలవనున్నాడు.

20వేల పరుగుల మైలురాయి చేరుకోనున్న కోహ్లీ:

20వేల పరుగుల మైలురాయి చేరుకోనున్న కోహ్లీ:

ఇటీవల ముగిసిన వెస్టిండీస్ సిరీస్‌తో పదివేల పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ.. బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దూకుడైన ఆటతీరును ప్రదర్శించి పదివేల పరుగుల క్లబ్‌లో చేరడమే కాక అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఆ క్లబ్‌లో చేరి సచిన్ రికార్డును సైతం బద్దలుకొట్టాడు. రాబోయే ఏడాది 2019 కోహ్లీ జీవితంలో ఓ మైలురాయిలా నిలిచిపోనుంది. 18665అంతర్జాతీయ పరుగులు చేసి 20 వేల పరుగుల క్లబ్‌లో చేరనున్నాడు. దీనికి కేవలం 1335 పరుగుల దూరం మాత్రమే ఉండటంతో ఏడాది మొత్తం మీద సాధించగలడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

100వన్డే వికెట్లు తీసేందుకు సిద్ధమవుతోన్న షమీ:

100వన్డే వికెట్లు తీసేందుకు సిద్ధమవుతోన్న షమీ:

బెంగాల్ నుంచి భారత్ తరపున ఆడుతున్న భయానకమైన ఫేసర్ మొహమ్మద్ షమీ.. ప్రత్యేకించి లాంగ్ ఫార్మాట్లలో కనిపించే షమీ.. దురదృష్టవశాత్తు పరమిత ఓవర్ల క్రికెట్‌కు అందుబాటులో లేడు. ఈ ఫార్మాట్‌లో షమీ స్థానాన్ని జస్ప్రిత్ బుమ్రా కొట్టేశాడు. అయితే వన్డే క్రికెట్‌లో 100వికెట్లు తీయడానికి ఇంకా 3వికెట్ల దూరం మాత్రమే ఉండడంతో అవి ఈ ఏడాదైనా సాధించగలడనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

Story first published: Tuesday, November 13, 2018, 16:11 [IST]
Other articles published on Nov 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X