న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5వ టీ20: సఫారీలతో ఆఖరి పోరుకు సై అంటోన్న 'కౌర్' సేన

5th T20I: Preview: India women eye a rare double series win against South Africa

హైదరాబాద్: సఫారీ గడ్డపై అద్వితీయమైన ఫలితాలతో భారత మహిళల జట్టు దూసుకెళ్తోంది. సఫారీ పర్యటనలో ఉన్న కోహ్లీ సేన సఫారీ జట్టును చిత్తుగా ఓడిస్తున్న తరుణంలో మహిళల జట్టు అదే ఫలితాలను కొనసాగిస్తోంది. రెండు సిరీస్‌ల నిమిత్తం సఫారీ పర్యటనకు బయల్దేరిన టీమిండియా రెండో సిరీస్‌ను కూడా గెలుచుకోవాలనే ఆరాటంలో ఉంది.

 వర్షం రాకపోయుంటే:

వర్షం రాకపోయుంటే:

మిథాలీ రాజ్‌ నేతృత్వంలో పరిమిత ఓవర్ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోగా, పొట్టి ఫార్మాట్‌లోనూ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని జట్టు సిరీస్‌ను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మూడో టీ20 మినహాయించి ఓటమి ఎరుగకుండా దూసుకుపోతోన్న హర్మన్ సేనకు వరుణుడు అడ్డురావడంతో నాలుగో టీ20 సైతం ఆశించిన విజయం దక్కకుండా అడ్డుపడింది.

 చరిత్ర లిఖించేందుకు సిద్ధం:

చరిత్ర లిఖించేందుకు సిద్ధం:

దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో శనివారం జరగనున్న ఆఖరి టీ20లో భారత జట్టు గెలిస్తే అరుదైన రికార్డును కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. సఫారీ గడ్డపై ఒకేసారి రెండు సిరీస్‌లు గెలుచుకున్న జట్టుగా రికార్డులకెక్కుతుంది.

 ఇదే తీరుతో కొనసాగితే విజయం తథ్యం:

ఇదే తీరుతో కొనసాగితే విజయం తథ్యం:

భారత మహిళల్లో వన్డే సారథి మిథాలీరాజ్‌ తొలి రెండు టీ20ల్లో 54, 76 పరుగులు సాధించింది. కానీ, మూడో మ్యాచ్‌లో మాత్రం డకౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక ఓపెనర్‌ శ్రుతి మంథాన కూడా మెరుగ్గానే రాణిస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో వరుసగా 28, 57, 37 పరుగులు సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌, మరో బ్యాట్స్‌ ఉమెన్ వి.కృష్ణమూర్తి కూడా మెరుగ్గానే రాణిస్తుండటంతో అదే జోరు చివరి మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే తప్పక విజయం సాధించవచ్చు.

సఫారీలు ఆపలేరు:

సఫారీలు ఆపలేరు:

మరోవైపు స్పినర్‌ అనూజ పాటిల్‌, పూనమ్ యాదవ్‌, పూజా వస్త్రాకర్‌లు కూడా చక్కగా ఆడుతున్నారు. వెటరన్ బౌలర్‌ జులన్‌ గోస్వామి స్థానంలో జట్టులోకి వచ్చిన 18ఏళ్ల పూజా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక పేస్‌బౌలర్‌ ఇస్మాయిల్‌ టీ20 కెరీర్‌లో తొలిసారిగా ఐదు వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించింది. ఇక చివరి టీ20లోనూ సమష్టిగా రాణిస్తే వారి గెలుపును నిలువరించడం సౌతాఫ్రికాకు సాధ్యం కాదు.

ఓడిపోయినా సిరీస్‌కు ప్రమాదం లేదు:

ఓడిపోయినా సిరీస్‌కు ప్రమాదం లేదు:

ఈ నేపథ్యంలో దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకోవాలంటే కేప్‌టౌన్‌లో శనివారం జరగనున్న మ్యాచ్‌ను గెలవాల్సిందే!

ఐదో టీ20లో పాల్గొనబోతున్న ఇరుజట్లు:

దక్షిణాఫ్రికా:

డేన్ వాన్ నీకెర్క్ (కెప్టెన్), మనీజనే కప్, త్రిష చెట్టీ, షబ్నిమ్ ఇస్మాయిల్, అయాబొంగ కాకా, మసాబట క్లాస్, సునే లూస్, ఒడినే కిర్స్టెన్, మినోన్ డు ప్రీజ్, లిజెల్ లీ, చోలీ ట్రాయ్న్, నాడిన్ డే క్రెలక్, రైసిబ్ నోటోజా, మోస్లైన్ డానియల్స్.

భారతదేశం:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), మిథాలి రాజ్, వేద కృష్ణమూర్తి, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, అనూజ పాటిల్, తానియా భాటియా, నుజాత్ పర్వేన్ పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్ర్రాకర్, రాధా యాదవ్, రుమేలి ధార్

Story first published: Friday, February 23, 2018, 17:28 [IST]
Other articles published on Feb 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X