యాషెస్ 2019: స్మిత్‌ను కట్టడి చేస్తారా? లేక ట్రోఫీని సమర్పించుకుంటారా?

Ashes 2019 : England Seek Solution For Steve Smith As Australia Eye Ashes Win

హైదరాబాద్: ఇంగ్లీషు గడ్డపై 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా జట్టు చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటికే 2-1తో ట్రోఫీని తిరిగి సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా గురువారం నుంచి ది ఓవల్ వేదికగా ఆరంభమయ్యే ఐదో టెస్టులో కూడా విజయం సాధించాలని ఊవిళ్లూరుతోంది.

ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో తొలి టెస్టును ఆసీస్‌ గెలవగా.. రెండో టెస్టు డ్రా ముగిసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్‌.. నాలుగో టెస్టులో ఆసీస్‌లు విజయం సాధించాయి. ప్రస్తుతం ఆసీస్‌దే పైచేయిగా ఉంది. ఆఖరి టెస్టులో కూడా విజయం సాధించి సుదీర్ఘ విరామానికి తెరదించాలని ఆసీస్ భావిస్తోంది.

సువర్ణావకాశం: యాషెస్ గెలిచి చరిత్ర సృష్టిస్తే ప్రధానికి నేరుగా ఫోన్ చేస్తా

18 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లాండ్‌ జట్టు యాషెస్ సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉంది. చివరగా 2001లో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 4-1తో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత గ్రెగ్‌ చాపెల్‌, రీకీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్‌ల సారథ్యంలోని రెండేసి సార్లు ఇంగ్లాండ్‌లో పర్యటించినా.. యాషెస్ ట్రోఫీని గెలవలేకపోయారు.

పైన్‌ ముంగిట అరుదైన అవకాశం

పైన్‌ ముంగిట అరుదైన అవకాశం

అలాంటిది అనుకోకుండా కెప్టెన్‌ అయిన పైన్‌ ముంగిట ఉంది. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో అతడు 134.20 యావరేజితో 671 పరుగులు సాధించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్‌కు గాయపడ్డాడు.

'ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై విమర్శలు చేసిన వాళ్లకు ఖతార్‌ మ్యాచ్‌తో నిరూపించాం'

రెండో ఇన్నింగ్స్‌కు దూరం

రెండో ఇన్నింగ్స్‌కు దూరం

దీంతో స్మిత్ రెండో ఇన్నింగ్స్‌కు దూరం కావడంతో పాటు మూడో టెస్టు మ్యాచ్‌కి దూరమయ్యాడు. తిరిగి నాలుగో టెస్టులో తుది జట్టులో స్థానం దక్కించుకున్న స్టీవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులతో చెలరేగిన స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఐసీసీ ర్యాంకుల్లో

ఐసీసీ ర్యాంకుల్లో

ఇక, ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికొస్తే ప్యాట్ కమిన్స్, హెజెల్ వుడ్‌, మిచెల్ స్టార్క్‌లతో చాలా పటిష్టంగా ఉంది. స్పిన్నర్ నాథన్ లియాన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తనదైన రోజున ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. మంగళవారం ఐసీసీ విడుదల చేసిన స్మిత్, కమిన్స్ తమ తమ అగ్రస్థానాలను మరింత పదిలం చేసుకున్నారు.

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్: రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!

ఇంగ్లాండ్‌కు చావో రేవో

ఇంగ్లాండ్‌కు చావో రేవో

మరోవైపు ఆతిథ్య ఇంగ్లాండ్‌ సైతం ఈ మ్యాచ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐదో టెస్టులో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. అయితే, ఆతిథ్య జట్టుని ఆటగాళ్ల ఫామ్ వేధిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఓపెనర్లు బారీ భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోతున్నారు. కెప్టెన్ రూట్‌, స్టోక్స్ మినహా మిగతా జట్టులోని ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తోంది.

జోఫ్రా ఆర్చర్ విఫలం

జోఫ్రా ఆర్చర్ విఫలం

మూడో టెస్టులో బెన్ స్టోక్స్ అద్భుతమైన సెంచరీతో ఇంగ్లాండ్‌ను రేసులోకి తీసుకొచ్చినప్పటికీ... నాలుగో టెస్టులో మళ్లీ నిరాశపరిచాడు. ఇక, ఇంగ్లాండ్ బౌలర్ల ప్రదర్శన కూడా అంతంత మాత్రమే. రెండో టెస్టులో తన బౌన్సర్లతో రాణించిన పేసర్ జోఫ్రా ఆర్చర్ త తర్వాత మ్యాచ్‌ల్లో పూర్తిగా తేలిపోయాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 11, 2019, 16:22 [IST]
Other articles published on Sep 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X