న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్: రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!

 Rohit Sharma to promote opener in test cricket in south africa tour of india

హైదరాబాద్: టెస్టుల్లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ కెరీర్ తొలినాళ్లలో వన్డేలు, టీ20ల్లో ఏడో స్థానంలో ఆడాడు. ఆ తర్వాత ఐదు, ఆరు స్థానాల్లో బరిలోకి దిగాడు.

అయితే, ఆ తర్వాత అనుకోకుండా ఓపెనర్‌గా విజయవంతం అవడంతో ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అత్యుత్తమ ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌‌లో విజయవంతమైన క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ... టెస్టుల్లో మాత్రం తుది జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది.

అసలేం జరుగుతోంది!: క్రికెట్‌లో 'హీట్‌ రూల్‌', హిట్ ఫర్ సిక్స్ అంటూ కొత్త నివేదికఅసలేం జరుగుతోంది!: క్రికెట్‌లో 'హీట్‌ రూల్‌', హిట్ ఫర్ సిక్స్ అంటూ కొత్త నివేదిక

ఇప్పటివరకు ఆడింది కేవలం 27 టెస్టులు మాత్రమే. కెరీర్ తొలినాళ్లలో టెస్టు క్రికెట్‌లో ఎన్నో అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే, ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఐదు సెంచరీలతో రోహిత్ శర్మ చక్కటి ఫామ్‌ని అందుకున్నాడు.

విండిస్ పర్యటనకు ఎంపికైనప్పటికీ

విండిస్ పర్యటనకు ఎంపికైనప్పటికీ

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టెస్టుల్లో రోహిత్ శర్మ ఎంపికైనప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఈ పర్యటనలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన చేయడంతో ఇప్పుడు తెరపైకి రోహిత్ శర్మ పేరు మరోసారి వచ్చింది. 2014లో అరంగేట్రం చేసిన కేఎల్‌ రాహుల్‌ మాత్రం ఇప్పటికే 36 టెస్టులు ఆడాడు.

రోహిత్ శర్మతో పోలిస్తే కేఎల్ రాహుల్ ప్రదర్శన ఇలా

రోహిత్ శర్మతో పోలిస్తే కేఎల్ రాహుల్ ప్రదర్శన ఇలా

అయితే, రోహిత్ శర్మతో పోలిస్తే కేఎల్ రాహుల్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌‌గా కేఎల్ రాహుల్ 36 మ్యాచ్‌ల్లో 34.58 యావరేజితో 2006 పరుగులు చేశాడు. టెస్టుల్లో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌‌గా బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ 27 టెస్టుల్లో 39.62 యావరేజితో 1585 పరుగులు సాధించడం విశేషం.

సుదీర్ఘ ఫార్మాట్‌లో రోహిత్ శర్మకు

సుదీర్ఘ ఫార్మాట్‌లో రోహిత్ శర్మకు

ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో రోహిత్ శర్మకు ఓపెనర్‌గా అవకాశమివ్వాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్ సైతం త్వరలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెస్కే ప్రసాద్ సైతం

ఎమ్మెస్కే ప్రసాద్ సైతం

టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "విండిస్ సిరీస్‌ తర్వాత సెలక్షన్‌ కమిటీ సమావేశం కాలేదు. ఈసారి మేం కలిసినపుడు రోహిత్‌ను టెస్టుల్లో ఓపెనర్‌గా పంపే అంశంపై చర్చిస్తాం" అని పేర్కొన్నాడు. అదే గనుక జరిగితే మరోసారి రోహిత్ శర్మను టెస్టుల్లో ఓపెనర్‌గా చూడొచ్చు.

Story first published: Wednesday, September 11, 2019, 14:21 [IST]
Other articles published on Sep 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X