న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా రికార్డు విజయం: తొలి వన్డేలో ఐదు గుర్తించని విషయాలివే

India vs West Indies 2018, 1st ODI: 5 Unnoticed Things From India’s Victory
5 unnoticed things from India’s scintillating victory over West Indies in the first ODI

హైదరాబాద్: టెస్టు సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా వన్డేల్లోనూ భారీ విజయంతో శుభారంభం చేసింది. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో వెస్టిండిస్‌ జట్టుపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.

<strong>వరుసగా ఆరో ఏడాది: సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన రోహిత్ శర్మ</strong>వరుసగా ఆరో ఏడాది: సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

అనంతరం 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 42.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (140), రోహిత్‌ శర్మ(152 నాటౌట్‌) సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ-రోహిత్‌ల జోడీ రెండో వికెట్‌కు 246 పరుగులు జోడించడం విశేషం.

దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే బుధవారం విశాఖ వేదికగా జరగనుంది. ఇదిలా ఉంటే, గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో గుర్తించని విషయాలు మీకోసం....

1
44266
#1 షిమ్రాన్ హెట్‌మయెర్ సెంచరీ

#1 షిమ్రాన్ హెట్‌మయెర్ సెంచరీ

వెస్టిండీస్ షిమ్రాన్ హెట్‌మయెర్ సెంచరీ సాధించాడు. 74 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వన్డేల్లో అతనికిది మూడోది కావడం విశేషం. ఈ సెంచరీతో భారత్‌పై అత్యంత వేగంగా సెంచరీ సాధించిన నాలుగో విండీస్‌ బ్యాట్స్‌మన్‌గా హెట్‌మెయిర్‌ అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో వివ్‌ రిచర్డ్స్‌ 72 బంతుల్లో సెంచరీ సాధించి తొలి స్థానంలో ఉండగా.. రికార్డో పావెల్‌ సైతం 72 బంతుల్లోనే ఈ ఫీట్‌ను సాధించి ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

శామ్యూల్స్‌ 73 బంతుల్లో సెంచరీ సాధించగా... తాజాగా హెట్‌మెయిర్‌ 74 బంతుల్లో సెంచరీ సాధించాడు. తద్వారా వెస్టిండిస్‌ తరపున వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. మూడు సెంచరీలు చేసేందుకు గాను హెట్‌మయెర్‌కు 13 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. వివ్‌ రిచర్డ్స్‌‌కు 16, గ్రీనిడ్జే 27, సిమన్స్‌ 41 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఇక హెట్‌మెయిర్‌కు భారత్‌తో ఇదే తొలి వన్డే మ్యాచ్‌ కావడం విశేషం.

#2 200వ వన్డేలో డకౌట్‌గా వెనుదిరిగిన మూడో విండిస్ బ్యాట్స్‌మెన్‌గా మార్లోన్ శామ్యూల్స్

#2 200వ వన్డేలో డకౌట్‌గా వెనుదిరిగిన మూడో విండిస్ బ్యాట్స్‌మెన్‌గా మార్లోన్ శామ్యూల్స్

గువహటి వేదికగా ఆతిథ్య భారత జట్టుతో జరిగిన తొలి వన్డే వెస్టిండిస్ బ్యాట్స్‌మన్ మార్లోన్ శామ్యూల్స్‌కు 200వ వన్డే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మార్లోన్ శామ్యూల్స్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. జట్టు స్కోరు 86 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో చాహల్ బౌలింగ్‌లో శామ్యూల్స్ డకౌట్ అయ్యాడు. భారత్‌పై శామ్యూల్స్ డకౌట్ అవడం ఇదే తొలిసారి. 2002లో విజయవాడలో జరిగిన వన్డే మ్యాచ్‌లో శామ్యూల్స్ సెంచరీతో విజృంభించాడు. విండిస్ తరుపున అత్యధికంగా డకౌట్లు అయిన ఆటగాడిగా కోట్నీ వాల్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక, 200వ వన్డేలో డకౌట్‌గా వెనుదిరిగిన ఆటగాళ్లలో మాజీ క్రికెట్ దిగ్గజాలు బ్రియాన్ లారా, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు సైతం ఉన్నారు.

#3 చాహాల్ తీసిన గత 6 వన్డే వికెట్లు కూడా బౌల్డ్ లేదా ఎల్బీడబ్య్లూ

#3 చాహాల్ తీసిన గత 6 వన్డే వికెట్లు కూడా బౌల్డ్ లేదా ఎల్బీడబ్య్లూ

భారత తరుపున పరిమిత ఓవర్లలో అత్యుత్తమంగా రాణిస్తోన్న బౌలర్లలో చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహాల్ ఒకడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో చాహాల్ 3 వికెట్లు తీసి విండిస్ పతనాన్ని శాసించాడు. చాహాల్ తీసిన మూడు వికెట్లు శామ్యూల్స్, హోల్డర్, నర్స్. ఈ మూడు వికెట్లలో శామ్యూల్స్, హోల్డర్ వికెట్లు ఎంతో కీలకం. కీలక సమయంలో వీరి వికెట్లను చాహాల్ తీశాడు కాబట్టి సరిపోయింది లేదంటో బర్సాపుర స్టేడియంలో భారత్ విజయ లక్ష్యం 340పైనే ఉండేది. కాగా, వన్డేల్లో చాహాల్ తీసిన గత 6 వికెట్లు కూడా ఎల్బీడబ్ల్యూ లేదా బౌల్డ్ కావడం విశేషం. వన్డేల్లో చాహాల్ తీసిన గత 6 వికెట్లు ఇలా LBW, Bowled, LBW, LBW, LBW, and Bowled ఉన్నాయి.

#4 వన్డేల్లో రోహిత్-కోహ్లీల జోడీ 11వసారి 150కి పైగా పరుగుల భాగస్వామ్యం

#4 వన్డేల్లో రోహిత్-కోహ్లీల జోడీ 11వసారి 150కి పైగా పరుగుల భాగస్వామ్యం

గువహటి వన్డేలో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీల జోడీ 11వసారి 150కిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి అనేక రికార్డులను బద్దలు కొట్టారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్‌ల భాగస్వామ్యం 246. భారత్‌ తరఫున వన్డే ఛేదనల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమం. 2009లో కోహ్లీ, గంభీర్‌ 224 పరుగులతో నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది. అంతేకాదు ఛేదనలో రెండో వికెట్‌కు అత్యధిక పరుగుల (246) భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తొలి భారత జోడీ రోహిత్‌-కోహ్లీ నిలిచింది. ఓవరాల్‌గా ఛేదనలో ఇది రెండో అత్యధికం. ఈ జాబితాలో వాట్సన్‌, పాంటింగ్‌ (252) ముందున్నారు.

#5 క్రికెట్ లెజెండ్ సచిన్ రికార్డుని సమం చేసిన విరాట్ కోహ్లీ

#5 క్రికెట్ లెజెండ్ సచిన్ రికార్డుని సమం చేసిన విరాట్ కోహ్లీ

గువహటి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 140 పరుగులు చేయడంతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేశాడు. 300కి పైగా పరుగుల ఛేదనలో అత్యధిక సెంచరీలు (8) చేసిన తొలి ఆటగాడు కోహ్లీ. అలాగే వరుసగా మూడు కేలండర్‌ ఇయర్స్‌ (20016-18)లో 2000కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగానూ సచిన్‌ టెండూల్కర్, మాథ్యూ హెడెన్‌, జో రూట్‌ సరసన కోహ్లీ నిలిచాడు. సచిన్ 1996-98 సంవత్సరాల మధ్య 2,000లకు పైగా పరుగులు సాధించాడు. మాథ్యూ హేడెన్‌ కూడా 2002-2004 సంవత్సరాల మధ్య ఏడాదికి రెండువేలకు పైగా పరుగులు సాధించాడు. జో రూట్‌ సైతం 2015-17 సంవత్సరాల మధ్య ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ సైతం 2015-18 సంవత్సరాల మధ్య ఏడాదికి రెండువేలకు పైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 2083 పరుగులు సాధించాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర అత్యధికంగా ఆరుసార్లు ఒక కేలండర్ ఇయర్‌లో 2000కి పైగా పరుగులు సాధించాడు.

Story first published: Monday, October 22, 2018, 16:32 [IST]
Other articles published on Oct 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X