న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో హీరో.. వన్డేల్లో మాత్రం జీరో! వెస్టిండీస్ టీమ్ వైఫల్యాలకు అసలు కారణాలు ఇవే!!

5 Reasons Why West Indies Lost Home ODI Series To Australia
Westindies Cricket A superhit in T20 Format and disastrous in Odi and tests.

హైదరాబాద్: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ క్రికెట్ టీమ్.. ఇప్పుడు అనామక జట్టుగా మారింది. 1980, 90ల్లో విండీస్ అంటే.. ప్రత్యర్థి జట్లు బయపడేవి. భయంకరమైన బ్యాట్స్‌మన్‌, బీకర పేసర్లతో నిండి ఉండేది. ఎందరో దిగ్గజాలు జట్టులో ఉండేవారు. టెస్ట్, వన్డే ఫార్మాట్ ఏదైనా వారిదే విజయం. అలాంటిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

చిన్నచిన్న జట్లు కూడా కరేబియన్లపై విజయాలు అందుకుంటున్నాయి. అయితే విండీస్ టీ20ల్లో మాత్రమే బలంగా ఉంది. వన్డే, టెస్టుల్లో ఎప్పుడో ఓసారి అలా మెరుస్తుంటారు. ఇందుకు ఉదాహరణే ఆస్ట్రేలియా సిరీస్. సొంతగడ్డపై టీ20 సిరీస్ 4-1తో గెలవగా..వన్డే సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. వన్డేల్లో విండీస్ పరాజయాలకు కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.

నిలకడగా ఆడే ప్లేయర్స్ లేరు

నిలకడగా ఆడే ప్లేయర్స్ లేరు

వన్డే ఫార్మాట్‌లో వెస్టిండీస్‌కు స్థిరత్వం లేకపోవడమే వారి పరాజయాలకు అసలు కారణం. ఒక మ్యాచులో పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ గాని, వికెట్లు తీసిన బౌలర్ గాని మరో మ్యాచులో మోస్తరు ప్రదర్శనకే పరిమితమవుతారు. మ్యాచ్ గెలిపించడానికి ఫలానా ప్లేయర్ ఉన్నాడులే అని ధీమా ఉన్న సందర్భమే లేదు. ఒక సిరీస్‌లో ఆడిన ప్లేయర్.. మరో సిరీస్‌లో ఉండడు. నిలకడగా ఆడే ప్లేయర్ ఒకరు కూడా జట్టులో లేడు. ప్లేయర్స్ జట్టులోకి వస్తూ పోతూ ఉంటారు. నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం విండీస్‌కు సరైన వన్డే జట్టు లేదు. కెప్టెన్ కూడా బెంచ్ మీద ఉన్నాడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఆసీస్ పర్యటనలో ఇదే జరిగింది.

సరైన తుది జట్టు లేదు

సరైన తుది జట్టు లేదు

సరైన తుది జట్టును ఎంచుకోకపోవడం కూడా వెస్టిండీస్ క్రికెట్ టీమ్ వన్డేలో ఓడిపోతుంది. కెప్టెన్ కిరన్ పోలార్డ్ జట్టును పదేపదే మార్చుతుంటాడు. క్రిస్ గేల్, షై హాప్, డారెన్ బ్రేవో, డ్వేన్ బ్రేవో, లెవీస్, పూరన్ పోలార్డ్, హేట్మియర్, హోల్డర్, జోసెఫ్, కాట్రేల్ వంటి స్టార్ ఆటగాళ్లకు కూడా తుది జట్టులో స్థానం ఉండదు. మేనేజ్మెంట్ కూడా ఆటగాళ్లకు నిరూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వట్లేదు. దీంతో మ్యాచ్, మ్యాచుకు ప్లేయర్స్ మారుతుంటారు. దీంతో ప్లేయర్స్ మధ్య సరైన అవగాహన లేక పరుగులు చేయలేకపోతున్నారు. మంచి భాగస్వామ్యాలు కూడా కరువయ్యాయి.

జూనియర్ మీరాబాయి చాను.. టీవీలో చూస్తూ అచ్చం దించేసిందిగా (వీడియో)!

అందరూ టీ20 ఆటగాళ్లే

అందరూ టీ20 ఆటగాళ్లే

ప్రస్తుతం విండీస్ జట్టులో ఉన్నవారు అందరూ టీ20 ఆటగాళ్లే. వేతనాలు తక్కువ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లీగుల్లో ఆడాడనికి కరేబియన్ ప్లేయర్స్ ఆసక్తిచూపిస్తారు. అంతర్జాతీయ జట్టుకు కాకుండా ప్రైవేట్ లీగుల్లో ఆడిన ప్లేయర్స్ కూడా జట్టులో ఉన్నారు. టీ20 ఫార్మాట్‌కు అలవాటుపడడంతో బాదుడే లక్ష్యంగా ఆడుతారు. టెస్ట్, వన్డేల్లో కూడా టీ20 ఫార్మాట్‌ లాగే ఆడతారు. అందుకే భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. ఒక్కోసారి 50 ఓవర్లు ఆడడానికి ఆపసోపాలు పడుతున్నారు. దీంతో తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతున్నారు. టీ20 ఫార్మాట్.. విండీస్ వన్డేలపై ప్రభావం చూపింది.

బ్యాటింగ్ వైఫల్యం

బ్యాటింగ్ వైఫల్యం

బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఆస్ట్రేలియా జట్టుపై వెస్టిండీస్ వన్డేల్లో పరాజయాలను ఎదుర్కొంటోంది. తొలి వన్డేలో పోలార్డ్ చేసిన 56 పరుగులే అత్యధికం. సగానికి పైగా మంది సింగల్ డిజిట్‌కే వెనుదిరిగారు. రెండో వన్డేలో పూరన్, హోల్డర్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. మూడో మ్యాచులో లెవీస్ తప్ప అందరూ విఫలమయ్యారు.

వన్డేల్లో ఒక బ్యాట్స్‌మన్‌ ఆడితే.. భారీ స్కోర్ అవకాశం ఉండదు. ఇదే విండీస్ జట్టును దెబ్బతీస్తోంది. ఇక ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా కరేబియన్లను దెబ్బకొట్టాడు. తొలి వన్డేలో 5, రెండో వన్డేలో 3, మూడో వన్డేలో 3 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టిన స్టార్క్.. విండీస్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు.

Story first published: Tuesday, July 27, 2021, 15:25 [IST]
Other articles published on Jul 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X