న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ కాకుంటే టీమిండియా కెప్టెన్ అయ్యేందుకు అర్హులు వీరే

India vs Westindies 2018 2nd Odi : Virat Kohli's Place Will Be Replaced By Whom?? | Oneindia Telugu
5 players who can captain India after Virat Kohli

హైదరాబాద్: మరి కొద్ది నెలలో ప్రపంచ కప్ మొదలుకానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్సీ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. పరుగుల యంత్రం కోహ్లీ కేవలం బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా మాత్రమే రాణిస్తున్నాడని మ్యాచ్ స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్నారని నిర్ణయం తీసుకోలేకపోతున్నాడని విమర్శలు వస్తున్నాయి.

ఒకవేళ కోహ్లీ తన కెప్టెన్సీని వదిలేస్తే ఆ స్థానంలో మరెవరిని సరిపోతారోననే బీసీసీఐ ఇప్పటికే ఆలోచిస్తూ ఉంది. ఈ క్రమంలో కోహ్లీ కాకపోతే మరి ఆ స్థానంలో కెప్టెన్‌గా ఎవరు సరిపోతారనే విషయానికొస్తే వివరాలిలా ఉన్నాయి.

1. రోహిత్ శర్మ

1. రోహిత్ శర్మ

భారత క్రికెట్ అభిమానులందరికీ తెలిసిన విషయం.. రోహిత్ శర్మలో మంచి కెప్టెన్ ఉన్నాడని. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించి ముంబై ఇండియన్స్‌కు మూడు ట్రోఫీలను తెచ్చిపెట్టాడు. అంతేకాదు, కోహ్లీ గైర్హాజరీ అయిన మ్యాచ్‌లలో టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించి రెండు ట్రోఫీలను అందించాడు. నిదహాస్ ట్రోఫీ, ఆసియా కప్ ట్రోఫీలను తీసుకొచ్చిన రోహిత్ శర్మ కెప్టెన్సీలో కూల్‌గా వ్యవహరిస్తాడని కూడా పేరు. కానీ, కోహ్లీ విషయానికొస్తే భావాలను దాచుకోడు. కోపం వస్తే.. వెంటనే ప్రదర్శించి దూకుడుతో కనిపిస్తాడు.

2. కేఎల్ రాహుల్

2. కేఎల్ రాహుల్

భారత జట్టులో అన్ని ఫార్మాట్లలో స్థానాన్ని కాపాడుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ కూడా ఈ స్థానానికి అర్హుడేనట. సరైన సమయంలో కచ్చితమైన ఆటతీరును ప్రదర్శించే కేఎల్ రాహుల్‌కు ఎక్కువ సార్లు అవకాశం రాకపోవడంతో అతని సత్తా చూపించుకునేందుకు వీలు లేకుండాపోతోంది. ఈ క్రమంలోనే టెస్టు ఫార్మాట్‌లో బ్యాటింగ్‌కు దిగి తనదైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇలా టెస్టు క్రికెట్లో బాగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ ఓ సారి అవకాశమొస్తే టీమిండియాలో స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తెలివిగా వ్యవహరించి సమయోచితంగా ఆడే క్రికెటర్. లాంగ్ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఎంచుకునే యోచనలో భావిస్తే సెలక్టర్లకు రోహిత్ కంటే రాహుల్‌యే బెటర్.

3. రిషబ్ పంత్

3. రిషబ్ పంత్

ఇటీవలే టీమిండియాలో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్ రిషబ్ పంత్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో జట్టులో కీపింగ్ బాధ్యతలు మోస్తున్న ఆటగాడు పంత్. అంతర్జాతీయ మ్యాచ్‌లలో టెస్టు ఫార్మాట్‌లో అరంగ్రేటం చేసిన పంత్.. ప్రతి మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ స్కోరు చేస్తూ సెలక్టర్ల దృష్టిలోపడ్డాడు. వెస్టిండీస్‌తో జరుగుతోన్న వన్డే ఫార్మాట్‌లోనూ చక్కటి ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. చక్కటి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్న పంత్.. భారత అన్ని ఫార్మాట్‌లలోనూ వ్యవహరించడం ప్రపంచకప్‌కు కెప్టెన్సీ వహించేందుకు ఉపయోగపడొచ్చు. ఇప్పటికే దేశీవాలీ లీగ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా ఉండడంతో భావి కెప్టెన్‌గా పనికొచ్చే సూచనలున్నాయి.

4. రవిచంద్రన్ అశ్విన్

4. రవిచంద్రన్ అశ్విన్

ఒకవేళ టీమిండియా విభిన్న ఫార్మాట్‌లలో కెప్టెన్‌ను ఎంచుకోవాల్సి వస్తే రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒక మంచి ఛాయీస్. ఎందుకంటే మైదానంలో ఉన్నంత సేపు సమయానికి తగ్గట్టు ఆలోచించడంలో అశ్విన్ చక్కగా వ్యవహరిస్తాడు. ఇదే కోణంలో ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టుకు చక్కటి నాయకత్వాన్ని ప్రదర్శించాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉండటంతో అతని స్థానంలో చాహల్, కుల్దీప్ యాదవ్‌లు బౌలింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ, ఇప్పటికీ టెస్టు ఫార్మాట్‌లో తన సత్తా చాటేందుకు అశ్విన్ ముందే ఉంటున్నాడు.

5. అజింకా రహానె:

5. అజింకా రహానె:

గతేడాది ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌కు కెప్టెన్సీ వహించిన రహానె అద్భుతంగా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో రహానె టెస్టు జట్టుకు నాయకత్వం వహించాడు. కోహ్లీలాగే అగ్రెసివ్ ఆటతీరును ప్రదర్శించే రహానె తన నాయకత్వంలోనే కుల్దీప్ అరంగ్రేటం చేశాడు. అశ్విన్, రహానెల మాదిరిగానే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఒకవేళ టెస్టు ఫార్మాట్‌లో కోహ్లీకి ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తే మాత్రం దానికి రహానె చక్కగా సరిపోతాడు.

Story first published: Friday, October 26, 2018, 16:06 [IST]
Other articles published on Oct 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X