న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లో అత్యధిక యావరేజి: ఆ ఐదుగురు క్రికెటర్లు ఎవరో తెలుసా?

5 Indian batsmen with the highest averages in Test cricket

హైదరాబాద్: సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్ ఆడటం అంటే ఇప్పటికీ ఓ ఛాలెంజే. టెస్టు క్రికెట్‌లోనే ఓ క్రికెటర్ యొక్క స్కిల్, స్టామినా, సహనం లాంటి తెలుస్తాయి. టెస్టుల్లో ప్రత్యర్ధి జట్టు బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు సాధించడం అనేది సాధారణ విషయం కాదు.

ఖవాజాను కవ్వించిన రిషబ్ పంత్: స్టంప్‌ మైక్‌లో రికార్డైన మాటలు (వీడియో)ఖవాజాను కవ్వించిన రిషబ్ పంత్: స్టంప్‌ మైక్‌లో రికార్డైన మాటలు (వీడియో)

భారత్‌కు చెందిన పలువురు బ్యాట్స్‌మెన్ టెస్టుల్లో ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించారు. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఈరోజు భారత జట్టు అగ్రస్థానంలో ఉందంటే గత టెస్టు ప్లేయర్ల పుణ్యమే. గతంలో భారత జట్టులో నెలకొల్పిన విలువలనే ఇప్పటికీ మన ఆటగాళ్లు పాటిస్తున్నారు.

టెస్టు క్రికెట్‌లో ఓ బ్యాట్స్‌మన్ సత్తాకు తార్కాణం అతడి యావరేజి. భారత టెస్టు చరిత్రలో అత్యధిక యావరేజిని కలిగి ఉన్న క్రికెటర్లను ఒక్కసారి చూస్తే...

ఛటేశ్వర్ పుజారా - 50.28*

ఛటేశ్వర్ పుజారా - 50.28*

గత ఐదేళ్లుగా భారత టెస్టు విజయాల్లో ఛటేశ్వర్ పుజారా కీలకపాత్ర పోషిస్తున్నాడు. టెస్టు క్రికెట్‌కు అవసరమైన టెక్నిక్ పుజారాలో ఉంది. అందుకే టెస్టుల్లో భారత్ తరుపున విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా అభిమానులచే ప్రశంసలు అందుకుంటున్నాడు. అంతేకాదు టెస్టుల్లో పుజారాని దివాల్ ద్రవిడ్ కూడా అభిమానులు పోలుస్తుంటారు. ద్రవిడ్‌ ఆడిన మూడో స్థానంలోనే వస్తాడు. ద్రవిడ్‌ లాగే అప్పుడప్పుడూ ఆపద్బాంధవ పాత్ర కూడా పోషిస్తుంటాడు. అందుకే పుజారాను ‘మిస్టర్‌ డిపెండబుల్‌'తో పోలుస్తుంటారు. టెస్టుల్లో అతను 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు ఇందుకు అతడికి 108 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. సరిగ్గా ద్రవిడ్‌ సైతం ఇన్నే ఇన్నింగ్స్‌ల్లో 5 వేల పరుగులు పూర్తి చేయడం విశేషం. ఇందులో 16 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

సునీల్ గవాస్కర్ - 51.12

సునీల్ గవాస్కర్ - 51.12

అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో పదివేల పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్ సునీల్ గవాస్కరే. 80ల్లో టెస్టు క్రికెట్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది కూడా సునీల్ గవాస్కరే. అంతలా తన అద్భుతమైన క్లాస్ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. 1987లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పుడు టెస్టుల్లో అత్యధిక పరుగులతో పాటు అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సునీల్ గవాస్కర్ నిలిచాడు. భారత్ తరుపున 214 టెస్టు ఇన్నింగ్స్ ఆడిన సునీల్ గవాస్కర్ 51.12యావరేజితో 10,122 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

రాహుల్ ద్రవిడ్ - 52.63

రాహుల్ ద్రవిడ్ - 52.63

90ల్లో భారత టెస్టు క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు రాహుల్ ద్రవిడ్. గత ముఫ్పై ఏళ్లలో భారత జట్టు అందించిన అత్యుత్తమ టెస్టు క్రికెటర్లు ఇద్దరే ఇద్దురు. అందులో ఒకరు సచిన్ టెండూల్కర్, మరొకరు రాహుల్ ద్రవిడ్. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు దివాల్. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో డిఫెన్స్‌కు పెట్టింది పేరు రాహుల్ ద్రవిడ్. అలాంటి ద్రవిడ్ 284 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 52.63యావరేజితో పదమూడువేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

సచిన్ టెండూల్కర్ - 53.78

సచిన్ టెండూల్కర్ - 53.78

క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు సచిన్ టెండూల్కర్. ప్రపంచ క్రికెట్‌లో ఎన్ని రికార్డులు అయితే ఉన్నాయో అన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. స్ట్రైట్ డ్రైవ్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సచిన్ టెండూల్కర్. భారత్ తరుపున మొత్తం 200 టెస్టులాడని సచిన్ టెండూల్కర్ 53.78 యావరేజితో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ - 54.13*

విరాట్ కోహ్లీ - 54.13*

మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో అభిమానులచే మన్ననలు అందుకుంటోన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అతి తక్కువ సమయంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొట్టిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీ మాత్రమే. అంతేకాదు మూడు ఫార్మాట్లలోనూ దూసుకుపోతున్నాడు. కోహ్లీ గత 33 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 3340 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు భారత్ తరుపున 125 టెస్టు ఇన్నింగ్స్‌లాడిన కోహ్లీ 54.13 యావరేజితో 6334 పరుగులు చేశాడు. ఇందులో 24 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Friday, December 7, 2018, 16:18 [IST]
Other articles published on Dec 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X