టెస్టు క్రికెట్‌ను కొన్నేళ్లపాటు శాసించారు: ఎవరా టాప్-5 బౌలర్లు!

Top 5 Bowlers Who Ruled No.1 Test Ranking For Many Years !

హైదరాబాద్: సాధారణంగా మనం బ్యాట్స్‌మెన్ గురించే చర్చించుకుంటుంటాం. అయితే, బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే బౌలర్లు సైతం అద్భుత ప్రదర్శన చేసిన సందర్భాలు అనేకం. బ్యాట్స్‌మెన్‌ను పోల్చేటప్పుడు 'Fab 4' అని సంబోధిస్తుంటాం. ప్రపంచ క్రికెట్‌లో కొన్ని సందర్భాలు బౌలర్లు సైతం డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

సర్ రిచర్డ్ హ్యాడ్లీ, మాల్కమ్ మార్షల్, కోర్ట్నీ ఆంబ్రోస్ లాంటి దిగ్గజ బౌలర్లు ప్రపంచ క్రికెట్‌ను ఏలారు. 1987లో టెస్టుల్లో ర్యాంకులను ప్రవేశపెట్టిన తర్వాత ఏళ్ల పాటు అగ్రస్థానంలో కొనసాగారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, టెస్టు క్రికెట్‌లో అగ్రస్థానంలో ఎక్కువ కాలం ఉన్న బౌలర్లను ఒక్కసారి గమనిస్తే...

ఫ్లాష్ బ్యాక్ ఫొటో.. నేనొక సాదాసీదా ప్రయాణికుడుని: రవిశాస్త్రి

డేల్ స్టెయిన్ (2008-2014, 2016)

డేల్ స్టెయిన్ (2008-2014, 2016)

మోడ్రన్ ఎరాలో ప్రపంచ క్రికెట్‌ అందించిన అత్యుత్తమ పేస్ బౌలర్లలో డేల్ స్టెయిన్ ఒకడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ పేసర్ సుమారు పదేళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను ఏలాడు. టెస్టుల్లో మొత్తం 439 వికెట్లు తీసి ఏ సఫారీ బౌలర్ సాధించిన ఘనతను సాధించాడు. తన టెస్టు క్రికెట్ ఆడే రోజుల్లో దక్షిణాఫ్రికా జట్టు అత్యధిక విజయాలను సాధించడంలో స్టెయిన్ పాత్ర ఎంతో కీలకం. టెస్టు క్రికెట్‌లో అతడి స్ట్రయిక్ రేట్ 44.3. 2008లో తొలిసారి డేల్ స్టెయిన్ టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకున్నాడు. సుమారు నాలుగేళ్ల పాటు ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచాడు.

ముత్తయ్య మురళీధరన్ (2003, 2006-2008)

ముత్తయ్య మురళీధరన్ (2003, 2006-2008)

శ్రీలంకకు చెందిన ఈ స్పిన్ దిగ్గజం టెస్టుల్లో సాధించని రికార్డు అంటూ లేదు. అత్యధిక టెస్టు వికెట్లు, టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు, టెస్టుల్లో అత్యధిక సార్లు పది వికెట్లు, టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక బంతులు సంధించిన బౌలర్ లాంటి ఎన్నో రికార్డులను ముత్తయ్య మురళీధరన్ తన ఖాతాలో వేసుకున్నాడు. సుమారు 20 ఏళ్ల పాటు క్రికెట్‌కు సేవలందించిన మురళీధరన్ 800 వికెట్లు తీశాడు. 133 టెస్టుల్లో 22.72 యావరేజిని కలిగి ఉన్నాడు. తన టెస్టు కెరీర్‌లో 67 సార్లు ఐదు వికెట్లను, 22 సార్లు పది వికెట్లను పడగొట్టాడు. 90 దశకాల్లో శ్రీలంక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. టెస్టుల్లో తొలిసారి 2003లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ 2006లో No. 1 స్థానంలో నిలిచి మూడేళ్ల పాటు ఈ ర్యాంకులో కొనసాగాడు.

గ్లెన్ మెక్‌గ్రాత్ (1996-97, 2001-2004)

గ్లెన్ మెక్‌గ్రాత్ (1996-97, 2001-2004)

లైన్ అండ్ లెంత్ బౌలింగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు గ్లెన్ మెక్‌గ్రాత్. ప్రపంచంలోని దిగ్గజ బ్యాట్స్ మెన్‌ను తన బౌలింగ్‌తో ముప్పతిప్పులు పెట్టాడు. ఆస్ట్రేలియా తరుపున సుమారు 14 ఏళ్లు సేవలందించాడు. టెస్టుల్లో 563 వికెట్లు తీశాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, గతేడాది మెక్‌గ్రాత్ రికార్డుని ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ బద్దలు కొట్టాడు. పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా చెలరేగడం మెక్‌గ్రాత్ ప్రత్యేకత. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మెక్‌గ్రాత్ అనేక సార్లు అగ్రస్థానంలో నిలిచాడు.

షేన్ వార్న్ (1994-1995, 2005)

షేన్ వార్న్ (1994-1995, 2005)

ప్రపంచ క్రికెట్‌లో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు దగ్గరగా వచ్చిన స్పిన్నర్ ఎవరైనా ఉన్నారంటే అది షేన్ వార్నే. టెస్టు క్రికెట్‌లో బౌలింగ్ విభాగంలో ముత్తయ్య మురళీధరన్ తర్వాత అత్యధిక రికార్డులను కలిగి ఉన్న బౌలర్ షేన్ వార్నే కావడం విశేషం. అయితే, షేన్ వార్న్ కెరీర్ అనేక వివాదలతో కూడుకుని ఉంది. తన 15 ఏళ్ల టెస్టు కెరీర్‌లో షేన్ వార్న్ మొత్తం 145 టెస్టు మ్యాచ్‌లాడి 708 వికెట్లు పడగొట్టాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో షేన్ వార్న్ తొలిసారి 1994లో అగ్రస్థానంలో నిలిచాడు.

రవిచంద్రన్ అశ్విన్ (2015-2017)

రవిచంద్రన్ అశ్విన్ (2015-2017)

టెస్టుల్లో అత్యంత వేగంగా 200, 250, 300 వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే రవిచంద్రన్ అశ్విన్ ఈ రికార్డులను సాధించడం విశేషం. అశ్విన్ తొలిసారి 2015లో టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు ఈ ర్యాంకులో కొనసాగాడు. స్వదేశంలో టీమిండియా టెస్టు విజయాల్లో అశ్విన్‌దే కీలకపాత్ర. జడేజాతో కలిసి టీమిండియా అనేక అద్భుతమైన విజయాలను కట్టబెట్టాడు. ఇప్పటివరకు భారత్ తరుపున 65 టెస్టు మ్యాచ్‌లు ఆడి 342 వికెట్లు తీశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 25, 2019, 15:11 [IST]
Other articles published on Sep 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X