కెరీర్‌లోనే ది బెస్ట్‌కు రాస్ టేలర్: ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం

Posted By:
 4th ODI: Tremendous Taylor sees Black Caps past England; hosts level series

హైదరాబాద్: డబ్లిన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాస్ టేలర్ (181 నాటౌట్) పరుగులు సాధించడంతో ఐదు వన్డేల సిరిస్‌లో న్యూజిలాండ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. గాయం కారణంగా మూడో వన్డేకి దూరమైన రాస్ టేలర్ నాలుగో వన్డేలో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

England vs New Zealand 2018 4th ODI Score Card

తద్వారా ఐదు వన్డేల సిరి‌స్ 2-2తో సమం కావడంతో ఆతిథ్య జట్టు తన ఆశలను సజీవంగా ఉంచుకుంది. మంగళవారం యూనివర్సిటీ ఓవల్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్ (147 బంతుల్లో 181 నాటౌట్; 17 ఫోర్లు, 6 సిక్సులు) అద్భుత ప్రదర్శన చేశాడు.

మరోవైపు టామ్ లాథమ్ (71) పరుగులతో అతడికి మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 187 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌‌తో తన కెరీర్‌లో 19వ వన్డే సెంచరీని నమోదు చేసిన రాస్ టేలర్ కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోరుని నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 335 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లలో జానీ బెయిర్ స్టో (138), జో రూట్ (102) పరుగులతో సెంచరీలు నమోదు చేశారు. కివీస్ బౌలర్లలో ఇష్ సోధీ 4 వికెట్లు, కోలిన్ మున్రో, ట్రెంట్ బౌల్డ్ చెరో రెండు వికెట్లు తీయగా, టిమ్ సౌథీ ఒక వికెట్ తీశాడు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు కొలిన్ మున్రో, మార్టిన్ గుప్టిల్‌లు డకౌట్లుగా వెనుదిరగడంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం కేన్ విలియమ్సన్ (45)ను బెన్ స్టోక్స్ ఔట్ చేయడంతో భారమంతా మిడిలార్డర్‌పై పడింది.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్ (181 నాటౌట్), టామ్ లాథమ్ (71)తో కలిసి మరో మూడు బంతులు మిగిలుండగానే జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ కుర్రిన్ రెండు వికెట్లు, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రాస్ టేలర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం (మార్చి 10)న క్రైస్ట్ చర్చ్ వేదికగా జరగనుంది. ఆఖరి వన్డేలో సిరిస్ విజేత ఎవరో తెలియనుంది. వన్డే సిరిస్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, March 7, 2018, 13:19 [IST]
Other articles published on Mar 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి