న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

4th ODI: బట్లర్‌ విధ్వంసం, 24 సిక్స్‌లతో ప్రపంచ రికార్డు

England VS Westindies : Buttler and Morgan Pummel Windies In Record-Breaking England Innings
4th ODI: Buttler and Morgan pummel Windies in record-breaking England innings

హైదరాబాద్: వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్స్‌ల మోత మోగించారు. ఓపెనర్లు అలెక్స్‌ హేల్స్‌ (73 బంతుల్లో 82; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), జానీ బెయిర్‌ స్టో (43 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చక్కటి శుభారంభాన్నిచ్చారు.

మ్యాక్స్‌వెల్ 113 నాటౌట్: రెండో టీ20లో ఆసీస్ విజయం, 11 ఏళ్ల తర్వాత సిరిస్ కైవసంమ్యాక్స్‌వెల్ 113 నాటౌట్: రెండో టీ20లో ఆసీస్ విజయం, 11 ఏళ్ల తర్వాత సిరిస్ కైవసం

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్‌ (77 బంతుల్లో 150; 13 ఫోర్లు, 12 సిక్స్‌లు), కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (88 బంతుల్లో 103; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) రెచ్చిపోయి ఆడాడు. జోస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్‌లు కలిసి నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. ఫలితంగా ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ మొత్తం 24 సిక్స్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఓ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా నిలిచింది. ఇదే సిరీస్‌‌లో తొలి వన్డేలో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ నెలకొల్పిన 23 సిక్స్‌ల రికార్డును అధిగమించారు. వన్డేల్లో 400పై స్కోరు సాధించడం ఇంగ్లాండ్‌కు ఇది నాలుగోసారి.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య వెస్టిండిస్ జట్టు 389 పరుగులకే కుప్పకూలింది. దీంతో నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Thursday, February 28, 2019, 10:23 [IST]
Other articles published on Feb 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X