న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సూపర్ ఫీల్డింగ్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు.. ఆ క్రికెటర్లు ఎవరంటే..?

4 Cricketers who won the Player of the Match award for fielding

హైదరాబాద్: క్రికెట్‌లో సాధారణంగా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తేనో లేక బౌలింగ్ చేస్తోనో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కుతుంది. కొన్నిసార్లు జట్టు విజయానికి కావాల్సింది చేసినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తారు. ఈ జాబితాలో కూడా ఎక్కువగా బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్.. లేకుంటే ఆల్‌రౌండర్‌లకే అవకాశం దక్కుతుంది. కానీ సూపర్ ఫీల్డింగ్‌కు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు దక్కిన సందర్భాలున్నాయి. మైదానంలో తనదైన ఫీల్డింగ్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లు ఈ ఘనతను అందుకున్నారు. ఇలా ఫీల్డింగ్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలుచుకున్న ఓ నలుగురి ప్లేయర్ల గురించి తెలుసుకుందాం.

 డేవిడ్ మిల్లర్(2019)

డేవిడ్ మిల్లర్(2019)

సౌతాఫ్రికా క్రికెట్ డేవిడ్ మిల్లర్ అద్భుతమైన ఫీల్డర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని ఫీల్డింగ్ విన్యాసాలు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ చూశాం. అయితే 2019లో పాకిస్థాన్‌తో జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో మిల్లర్ తనదైన ఫీల్డింగ్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాక్ 10 ఓవర్లకు 85 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ మిల్లర్ సూపర్ ఫీల్డింగ్‌కు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో మిల్లర్ 2 రనౌట్లతో పాటు నాలుగు సూపర్ క్యాచ్‌లు అందుకొని పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. ముఖ్యంగా బాబర్ ఆజామ్‌ను సూపర్ త్రోతో రనౌట్ చేసి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు. ఈ సూపర్ ఫీల్డింగ్‌తో మిల్లర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

జాంటీ రోడ్స్-1993

జాంటీ రోడ్స్-1993

ఫీల్డింగ్‌కు మారుపేరు సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ సైతం తనదైన మార్క్ ఫీల్డింగ్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. 1993లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ 5 క్యాచ్‌లు అందుకొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో సూపర్ డైవ్‌తో బ్రియాన్ లారా క్యాచ్ అందుకున్న జాంటీ.. కళ్లు చెదిరే క్యాచ్‌తో ఫిల్ సిమ్మన్స్‌‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత జిమ్మీ ఆడామ్స్, ఆండర్సన్ కమిన్స్, డెస్మాండ్ హైనెస్ క్యాచ్‌లు అందుకొని ఔరా అనిపించాడు. అంతకు ముందు బ్యాటింగ్‌లో 40 పరగులు కూడా చేసి విండీస్ పతానాన్ని శాసించాడు.

మార్క్ టేలర్..1992

మార్క్ టేలర్..1992

ఆస్ట్రేలియా మాజీ కెప్టె మార్క్ టేలర్ సైతం తనదైన ఫీల్డింగ్‌తో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అందుకున్నాడు. 1992లో వెస్టిండీస్‌తో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన మార్క్ టేలర్ కీలకమైన నాలుగు క్యాచ్‌లు పట్టి జట్టు విజయానికి బాటలు వేసాడు. ఇవన్నీ కూడా స్లిప్‌లోనే ఉండి అందుకోవడం విశేషం. గస్ లోగీ, కార్ల్ హూపర్, జూనియర్ ముర్రీ, కీల్ అర్థర్టన్‌లను తనదైన క్యాచ‌లో పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో ఆసీస్ 14 పరుగులతో విజయం సాధించింది.

వీవీ రిచర్డ్స్.. 1989

వీవీ రిచర్డ్స్.. 1989

క్రికెట్ దిగ్గజం సర్ వీవీ రిచర్డ్స్ కూడా తనదైన ఫీల్డింగ్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. అది కూడా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. 1989 ఎమ్ఆర్‌ఎఫ్ వరల్డ్ సిరీస్‌లో భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్లో రిచర్డ్స్ మూడు క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 165 పరుగులకే కుప్పకూలింది. రిచర్డ్స్ మూడు క్యాచ్‌లతో పాటు ఎన్నో పరుగులను అడ్డుకున్నాడు. దిలిప్ వెంగ్ సర్కార్, రమన్ లంబా, మనోజ్ ప్రభాకర్‌ల క్యాచ్‌లను రిచర్డ్స్ అందుకున్నాడు. దాంతో భారత్ ఓటమిపాలైంది.

Story first published: Sunday, June 20, 2021, 18:57 [IST]
Other articles published on Jun 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X