న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 ఆతిథ్యం కోసం పోటీపడుతున్న 4 దేశాలు.. బీసీసీఐ ఆసక్తి మాత్రం అటువైపే!!

4 Countries have offered to host the IPL 2021, BCCI interest on UAE

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 విష‌యంలో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) అనుకున్న‌ది ఒక‌టి.. జరిగింది ఇంకొకటి. ఊహించ‌ని రీతిలో బ‌యో బబుల్‌లోకి కూడా కరోనా వైర‌స్ చొర‌బ‌డి ఆట‌గాళ్లు దాని బారిన ప‌డ‌టంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మెగా టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది.

మొదటగా కోల్‌కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తీ, సందీప్ వారియర్‌కు పాజిటీవ్ రాగా.. ఆ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా, హైదరాబాద్ కీపర్ వృద్దిమాన్ సాహా, చెన్నై కోచ్‌లు మహమ్మారి బారిన పడ్డారు. దాంతో ఆటగాళ్ల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ లీగ్‌ను గత మంగళవారం నిరవధికంగా వాయిదా వేసింది.

సెప్టెంబర్‌లో లీగ్

సెప్టెంబర్‌లో లీగ్

ఐపీఎల్ 2021లో మొత్తం 60 మ్యాచ్‌లకు గాను.. మంగళవారం లీగ్ ఆగిపోయేసమయానికి 29 మ్యాచులే పూర్తయ్యాయి. ఒకవేళ ఐపీఎల్ 2021లోని మిగతా మ్యాచులు జరగకపోతే.. బీసీసీఐ 2500 కోట్లు నష్టపోనుందని స్వయంగా సౌరవ్ గంగూలీనే తెలిపారు. ఈ నేపథ్యంలో సీజన్‌ను తిరిగి నిర్వహించే సమయం, వేదిక గురించి బీసీసీఐ యోచిస్తోంది. అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌నకు బీసీసీఐ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కావున అంతకంటే ముందే సెప్టెంబర్‌లో మిగిలిన సీజన్‌ను నిర్వహించే వీలుంది. అయితే అప్పుడు కూడా దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగితే.. లీగ్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌నూ ఇక్కడి నుంచి తరలించక తప్పని పరిస్థితి ఎదురుకానుంది.

యూఏఈకే బీసీసీఐ ఓటు

యూఏఈకే బీసీసీఐ ఓటు

ఇక ఐపీఎల్‌ 2021 మిగతా సీజన్‌ నిర్వహణ కోసం ఇప్పటివరకూ యూఏఈ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పోటీపడ్డాయి. తాజాగా శ్రీలంక కూడా రేసులో నిలిచింది. భారత్‌లో ఇదే పరిస్థితి ఉండి టీ20 ప్రపంచకప్‌ను తరలించాల్సి వస్తే.. బీసీసీఐ కచ్చితంగా యూఏఈలోనే మెగా టోర్నీని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఎదుకంటే ఇప్పటికే అక్కడ ఐపీఎల్ 2020 సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2021 కూడా అక్కడే జరిగే వీలుంది. ఇదే జరిగితే ఇంగ్లండ్ పర్యటన తర్వాత ఐపీఎల్, ప్రపంచకప్‌ కోసం కోహ్లీసేన నేరుగా యూఏఈ చేరుకునే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్‌ గొప్ప మనసు.. కరోనా కట్టడి కోసం ఏకంగా 30 కోట్ల విరాళం! ఫాన్స్ ఫుల్ హ్యాపీ!

ఇంగ్లండ్‌లో ఖర్చు ఎక్కువ

ఇంగ్లండ్‌లో ఖర్చు ఎక్కువ

ఒకవేళ ఇంగ్లండ్‌లోనే ఐపీఎల్ 2021 నిర్వహించాలని భావిస్తే.. భారత ఆటగాళ్లు అక్కడే ఉంటారు కాబట్టి మిగతా క్రికెటర్లను అక్కడికి తరలిస్తారు. అయితే యూఏఈతో పోలిస్తే.. ఇంగ్లండ్‌లో ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇది బీసీసీఐకి పెద్ద బొక్కే అని చెప్పొచ్చు. ఇక ఐపీఎల్ ఆతిథ్యం కోసం ఆస్ట్రేలియా, శ్రీలంక దేశాలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. బీసీసీఐ వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే ఇంగ్లండ్ నుంచి భారత జట్టును, భారత దేశీ ఆటగాళ్లు, మిగతా అంతర్జాతీయ క్రికెటర్లను.. ఆ దేశాలకు తీసుకొచ్చి, మళ్లీ అక్కడి నుంచి టీ20 ప్రపంచకప్‌ కోసం యూఏఈకి తరలించడం పెద్ద తలనొప్పిగా మారనుంది.

ప్రధాన కారణం డబ్బు

ప్రధాన కారణం డబ్బు

ఐపీఎల్ 2021 లీగ్‌ నిర్వహణకు ఈ యూఏఈ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక దేశాలు ముందుకు రావడానికి ప్రధాన కారణం డబ్బు. ఐపీఎల్ 2021 సక్సెస్ చేసినందుకు ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డుకు బీసీసీఐ దాదాపు 100 (రూ.98.5) కోట్లు చెల్లించింది. ఆ మొత్తం ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డుకు భారీ ఆదాయమనే చెప్పాలి. కరోనా కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న క్రికెట్‌ బోర్డులకు ఈ ఆదాయం కలిసొచ్చేదే. దీంతో పాటు ఇతర మార్గాల్లోనూ భారీగానే రాబడి ఉంటుంది. అందుకే అన్ని దేశాలు ఐపీఎల్ టోర్నీ నిర్వహిస్తామని ముందుకు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌కు యూఏఈ ప్రత్యామ్నాయ వేదిక అని బీసీసీఐ ఇప్పటికే తెలిపింది. ఆ మేరకు చర్చలు కూడా జరిపింది.

Story first published: Monday, May 10, 2021, 15:56 [IST]
Other articles published on May 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X